పవన్ మాటల అనంతరం..J.R.ఎన్టీఆర్ పాత వీడియో వైరల్.. ఎందుకంటే..?
అలాగే మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా ఒక దుమారాన్ని రేపేల చేస్తున్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి జనసేననే కారణమని ఎవరైనా వారే అనుకుంటే అది వారి ఖర్మ అంటూ నాగబాబు పలు రకాల వ్యాఖ్యలు చేశారు. దీంతో వర్మ అభిమానులు టిడిపి నేతలు కూడా హర్ట్ అవ్వడం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ కోటా కింద ఈయనని పంపిస్తామని చెప్పిన వర్మకి ఎలాంటి అవకాశాలు జరగలేదు.పైగా దక్కాల్సిన స్థానం కంటే వర్మకి అవమానాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి.
జనసేన పార్టీ ఆవిర్భావ సభ జయకేతనం అనంతరం జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించిన ఒక పాత వీడియో వైరల్ గా మారుతున్నది.. ఈ వీడియోలో అటు జూనియర్ ఎన్టీఆర్ కు ఇటు టిడిపికి మ్యూచువల్ గా ఉన్న అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు.. మన చెవుల్లో బాకాలు ఉదే కల్తి నాయకులు మనకు వద్దు అని మనకు కావాల్సిన నికార్సైన నిజమైన తెలుగుదేశ పార్టీ కార్యకర్తలు నాయకులు కావాలని పార్టీకి కష్టం వచ్చిన నష్టం వచ్చిన కాపాడుకునేందుకు మేము ఉన్నామని ముందుకు వచ్చే టిడిపి పార్టీ యోధులే కావాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రసంగాన్ని వినిపించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. టిడిపి కార్యకర్తలు ఈ వ్యాఖ్యలు ఎవరు ఉద్దేశించి ఇప్పుడు వైరల్ గా చేస్తున్నారో తెలియాల్సి ఉన్నది.