డ్రాగన్ కంట్రీ, దాయాది దేశం కుట్ర.. భారత్‌పై బురదజల్లే ప్రయత్నం?

praveen
బెలూచిస్తాన్ భగ్గుమంటోంది. చైనా-పాకిస్థాన్ల దోస్తీ బంధం కంపుకొడుతోంది. అక్కడ జనం ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కానీ ఈ రెండు దేశాలు కలిసి ఆ మంటల్ని భారత్‌పైకి తిప్పే కుట్ర పన్నుతున్నాయి. బెలూచిస్తాన్‌లో జరుగుతున్న దాడులకు భారతే కారణమని అంతర్జాతీయ సమాజానికి నమ్మబలికేందుకు తెగ ప్రయత్నిస్తున్నాయి.
అసలు మ్యాటర్ ఏంటంటే, చైనా కన్ను బెలూచిస్తాన్‌పై పడింది. అక్కడి ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు స్కెచ్ వేసింది. పాకిస్థాన్‌కు మాయమాటలు చెప్పి గ్వాదర్ పోర్టును గుప్పిట్లో పెట్టుకుంది. దాని ద్వారా వచ్చే ఆదాయంలో సింహభాగం డ్రాగన్ కంట్రీదే. పాకిస్థాన్‌ మాత్రం నామమాత్రపు వాటాకు గడ్డితినాల్సి వస్తోంది. ఇది బెలూచ్ ప్రజలకు కడుపు మంట కలిగిస్తోంది.
పైగా గ్వాదర్ పోర్టు చైనాకు అడ్డాగా మారడంతో స్థానికులకు ఉపాధి గల్లంతైపోయింది. చైనీయులు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. మా భూమి, మా నీరు.. మా ఉద్యోగాలు.. అన్నీ చైనా వాళ్లకా అంటూ బెలూచ్ ప్రజలు రగిలిపోతున్నారు. అందుకే వాళ్లు తిరుగుబాటు బాట పట్టారు. చైనా ప్రాజెక్టులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు. ఇటీవల రైలుపై దాడి ఘటన కూడా అందుకే జరిగింది.
బెలూచ్ రెబెల్స్ దాడులతో చైనా, పాకిస్తాన్ ఉలిక్కిపడ్డాయి. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు, ప్రపంచం దృష్టిని మరల్చేందుకు కొత్త డ్రామాకు తెరలేపాయి. బెలూచ్ తిరుగుబాటు వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపిస్తున్నాయి. తాలిబన్లు ఉన్నారని తెలిసినా, ఉగ్రవాదులు ఉన్నారని తెలిసినా.. కావాలనే భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు కుట్ర చేస్తున్నాయి.
అయితే ఈ డొల్ల వాదనలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. బెలూచిస్తాన్‌లో జరుగుతున్న అన్యాయం ప్రపంచానికి తెలుసు. చైనా, పాకిస్తాన్ ల దోపిడీని ఎండగడుతూనే ఉంటారు. భారత్‌పై బురదజల్లే ప్రయత్నాలు మాత్రం బెడిసికొట్టడం ఖాయం. ఈ రెండు దేశాల కుట్రలను అంతర్జాతీయ సమాజం ఛీ కొడుతుంది. బెలూచిస్తాన్ ప్రజలకు మద్దతుగా నిలుస్తుంది. ఈ వ్యవహారంలో చివరికి తెలుతుందో ఏంటో చూడాల్సి ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: