కాంగ్రెస్ : విజయశాంతి కోసం సినిమాలు చూస్తారేమో కానీ ఓట్లు వేయరు?

frame కాంగ్రెస్ : విజయశాంతి కోసం సినిమాలు చూస్తారేమో కానీ ఓట్లు వేయరు?

Veldandi Saikiran
కాంగ్రెస్ పార్టీ నుంచి తాజాగా ఎమ్మెల్సీ బాధ్యతలు తీసుకున్న విజయశాంతి పై సొంత పార్టీ నేతలే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. విజయశాంతి కోసం సినిమాలు చూస్తారేమో కానీ ఓట్లు వేయరని... బాంబు పేల్చారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి   తాజాగా మీడియాతో మాట్లాడుతూ... విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాత్ర పై... ఆయన స్పందించారు.  ఎన్నికల సమయంలో విజయశాంతి నాకోసం ప్రచారం చేస్తా అంటే నాకే నెగిటివ్ అవుతుందని వద్దని చెప్పినట్లు సంచలన వ్యాఖ్యలు చేశాడు నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి.
 సినిమా నటుల కోసం సినిమాలు చూస్తారు కానీ ఓట్లు వేయరు అంటూ ఆయన తెలపడం జరిగింది. విజయశాంతి సినిమాలు ఎన్నో సక్సెస్ అయ్యాయి... సినిమాలు సక్సెస్ అయ్యాయని... రాజకీయాల్లో సక్సెస్ అవుతారని చెప్పలేమన్నారు.   కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం ఎంతో పనిచేస్తుందని వివరించారు. తెలంగాణ రావడానికి కాంగ్రెస్ మూల కారణమని... ఏ వ్యక్తి వల్ల ప్రత్యేక తెలంగాణ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందన్నారు.
 ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీ దే అని కొనియాడారు. అయితే విజయశాంతి పై నారాయణ ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి చేసిన వ్యాఖ్యలపై విజయశాంతి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాకముందే విజయశాంతి పార్లమెంటు సభ్యులుగా గెలిచారని గుర్తు చేస్తున్నారు. అనవసరంగా విజయశాంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు విజయశాంతి అభిమానులు. ఇది ఇలా ఉండగా... తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఐదుగురు ఎమ్మెల్సీ బరిలో ఉంటే ఐదుగురు కూడా ఏకగ్రీవం అయ్యారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయశాంతి కూడా ఎమ్మెల్సీ పదవి తప్పించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: