తెలంగాణలో పుంజుకుంటున్న బీజేపీ..కాషాయ పార్టీ ఖాతాలో మరో ఎమ్మెల్సీ!

frame తెలంగాణలో పుంజుకుంటున్న బీజేపీ..కాషాయ పార్టీ ఖాతాలో మరో ఎమ్మెల్సీ!

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగింది. మరో ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బీజేపీ  అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి గెలుపొందారు. రెండవ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఉండగా.. మూడవ స్థానంలో బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణ నిలిచారు. ఓట్ల లెక్కింపు సైతం ఆసక్తికరంగా సాగింది. గ్రాడ్యుయేట్లు ఈ ఎన్నికల్లో ఆసక్తికరమైన తీర్పునిచ్చారు. ఎన్నికల్లో దాదాపు ముగ్గురు అభ్యర్థులు పోటీపడ్డారు. దీంతో ముగ్గురి మధ్య ఓట్ల తేడా స్వల్పంగా కనిపించింది. చివరికి కొంత మెజారిటీతో అంజిరెడ్డి గెలిచారు. 

మొన్నటి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం బీజేపీ  అభ్యర్థి విజయం సాధించారు. దీంతో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం ఆ పార్టీకి మైనస్ అయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.  కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా ఓడినా తమ పార్టీకి నష్టం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలను పట్టభద్రులు, ఉపాధ్యాయులు సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని నిరుద్యోగులు, ఉద్యోగులు కష్టపడిన సంగతి తెలిసిందే. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ఫలితాలు రాకపోవడంతో వారు నిరాశ చెందినట్టు కనిపిస్తోంది. ఉద్యోగులు డీఏ పెంపు లేకపోవడంతో నిరాశ చెందగా.. నిరుద్యోగులు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఊహించినట్టుగా రాకపోవడంతో నిరాశ చెందినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ విజయంతో తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ నిండుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీ మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. త్వరలోనే కొత్త అధ్యక్షుడిని ప్రకటించి సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్నారు. మరి ముందు ముందు బీజేపీ నేతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: