ఏపీ ఎమ్మెల్సీ: ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఫలితాలు.. గాదె శ్రీనివాసులు విజయం ..!
అయితే దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను సైతం లెక్కింపు ప్రక్రియలో రఘువర్మ పైన గాద శ్రీనివాసులు ఆదిక్యం సాధించారట. దీంతో శ్రీనివాసులు గెలుపొందినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ బిజెపి పార్టీ మద్దతు ఇచ్చిన శ్రీనివాసులు మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక తన ఓటమిని అంగీకరించినటువంటి రఘువర్మ శ్రీనివాసులకు ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్లిపోయారట. కానీ కూటమిలో భాగంగా బిజెపి ,జనసేన, టిడిపి పార్టీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వేరువేరుగా తమ అభ్యర్థులను మద్దతు ప్రకటించుకున్నారు.
గత నెల 27వ తేదీన జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం మీద 19,813 మంది టీచర్లు సైతం ఓటు హక్కును వినియోగించుకున్నప్పటికీ గాదె శ్రీనివాసులు నాయుడుకు 7210 ఓట్లు వచ్చాయట. పాకాల పాటి రఘువర్మకు సైతం 6845 ఓట్లు సంపాదించుకున్నారట.. అలాగే విజయ గౌరీ 5804 ఓట్లు సంపాదించుకున్నారట. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో అభ్యర్థులు విజయాన్ని తేల్చలేకపోయాయి. దీంతో రెండవ రౌండ్ ప్రాధాన్యత ఓట్లు సైతం లెక్కింపు చేపట్టారు. ఇందులో గాదె శ్రీనివాసులు నాయుడు విజయాన్ని అందుకున్నారు. మరి దీంతో బిజెపి పార్టీ మద్దతు పెరుగుతోందా ఏపీ అంత అనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయి.