మెగా డీఎస్సీ పై అసెంబ్లీ సాక్షిగా లోకేష్ గుడ్ న్యూస్..!

Amruth kumar
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన  మెగా డీఎస్సీ హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు .. ఇక కూటామి ప్రభూత్వం అధికారంలోకి రాగానే క్యాబినెట్లో మెగా డీఎస్సీ ద్వారా టీచర్ ఖాళీ ల భర్తీ పై సీఎం చంద్రబాబు సంతకాలు కూడా చేశారు .. అయినా కూడా ఇప్పటి వరకు ఆ హామీ అలాంటి అమలకు నోచుకోలేదు .. ఇక దీంతో అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.   అయితే ఈరోజు మరోసారి విద్యాశాఖ మంత్రి లోకేష్ అసెంబ్లీ వేదిక గా కీలక హామీ ఇచ్చారు .



ఇక రాష్ట్రం లో ఖాళీగా ఉన్న 16 ,340 టీచర్ పోస్టుల భర్తీ కి త్వరలోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని విద్య శాఖ మంత్రి లోకేష్ అసెంబ్లీ లో ప్రకటన చేశారు .. వైసిపి ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్ , మత్స్యలింగం , ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి , బి. విరూపాక్ష  పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ అసెంబ్లీ లో సమాధానమిచ్చారు .. అలాగే ఇదే క్రమం లో మెగా డీఎస్సీ నిర్వహణ కు చర్యలు చేపడుతున్నట్టు లోకేష్ చెప్పుకొచ్చారు .. అలాగే వచ్చే విద్య సంవత్సరం ప్రారంభించే నాటికి టీచర్ల ఖాళీలు భర్తీ చేయాలని సీఎం చెప్పిన నేప‌థ్యం లో లోకేష్ ఇలాంటి ప్రకటన చేశారు .

 

గత 30 ఏళ్ల టిడిపి ప్రభుత్వ హయాంలోనే 13 డీఎస్సీలను నిర్వహించారు .. ఇందులో 1,80, 272 టీచరు పోస్టులను భర్తీ చేశారు .. అలాగే రాష్ట్ర విభజన తర్వాత కూడా నవ్యాంధ్రప్రదేశ్లో 2014 - 19 మధ్యకాలంలో చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వం .. 2014, 18 , 19 కాలంలో మూడు డీఎస్సీల నిర్వహణ ద్వారా 16,701 టీచర్ పోస్టులను భర్తీ చేసింది . అలాగే అందుకు సంబంధించిన పూర్తిస్థాయి గణాంకాల వివరాలను కూడా అసెంబ్లీలో మంత్రి అందజేశారు.


మెగా డీఎస్సీ పై వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడిగారు, కానీ అసెంబ్లీ ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. కనీసం టీవీల్లో అయినా చూడండి. #APBudget2025 #PrajaBudget2025 #APAssembly #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh pic.twitter.com/ySevGNu5f0

— telugu desam party (@JaiTDP) March 3, 2025

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: