
ఏపీ: ఉచిత బస్ కి కండిషన్స్ అప్లై..?
సూపర్ సిక్స్ హామీల వల్ల కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారాన్ని అందుకుంది. అయితే ఇప్పటిదాకా ఈ పథకం గురించి అమలు చేయకపోవడంతో చాలానే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అటు ప్రజలు విమర్శించడమే కాకుండా వైసిపి నేతలు కూడా విమర్శిస్తున్నారు.. గత ఏడాది నుంచి దసరా సంక్రాంతికి అంటూ పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నప్పటికీ ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయం పైన పలుకీలక నిర్ణయం తీసుకున్నదట.
ఉగాది నుంచి అమలు చేయడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసిందని అయితే ఇందుకోసం కొన్ని కండిషన్స్ కూడా పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీకి నష్టలు రాకుండా చూసేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని పోరుగు రాష్ట్రాలలో కాకుండా.. కేవలం రాష్ట్రాల సరిహద్దు దాకా ఉంచ బోతున్నారని.. అలాగే ఈ పథకాన్ని అమలు చేయడానికి కొన్ని హద్దులను కూడా నిర్ణయించుకున్నారట.. ఈ పథకం ఎవరైతే మహిళలు ఏ ఏ జిల్లాలలో ఉంటారో ఆ జిల్లా పరిధిలోనే ఉచితంగా ఉండబోతుందట.ఇతర జిల్లాలకు వెళ్లాలి అంటే కచ్చితంగా టికెట్టు తీసుకోవలసి ఉంటుందట. ఇలా ఉచిత బస్సుల నడిపించేలా ప్లాన్ చేస్తోందట కూటమి ప్రభుత్వం. ఇలా చేసినా కూడా నెలకు 400 కోట్ల రూపాయలు ఆర్టీసీ మేరకు ఖర్చు అవుతుందట. మరి మహిళల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.