గెలుపు కోసం టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి అష్ట క‌ష్టాలు..

frame గెలుపు కోసం టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి అష్ట క‌ష్టాలు..

RAMAKRISHNA S.S.
వైఎస్ఆర్ కాంగ్రెస్ రంగంలోకి దిగలేదు .. తెలుగుదేశం అభ్యర్థుల విజయం కన్ఫర్మ్ అవుతుందని పట్టభద్రులు ఎమ్మెల్సీ నియోజకవర్గం బరిలో ఉన్న అభ్యర్థులు ముందుగా కలలు కన్నారు .. తాము ఎమ్మెల్సీ అయిపోయినట్టే అని అనుకున్నారు . అయితే వైసీపీ బరిలో లేకపోయినా.. గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో తెలుగుదేశానికి గెలుపు అంత ఈజీ కాద‌ని .. రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి . జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ కోసం తెనాలి సీటు త్యాగం చేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజా .. టీడీపీ తరఫున గుంటూరు, కృష్ణాజిల్లాల పట్టబద్రుల స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.


ఈ ఎమ్మెల్సీ ఎన్నిక నుంచి తాము తప్పుకుంటున్నట్టు వైసీపీ ఎప్పుడో ప్రకటించింది. అయితే అక్కడ వామపక్షాల తరఫున ఉపాధ్యాయ సంఘాలతో చాలా సన్నిహితంగా ఉండే ప్రస్తుత ఎమ్మెల్సీ ఏ. ఎస్. లక్ష్మణరావు పోటీ చేస్తున్నారు . ఆయనకు రెండు జిల్లాలలోను దాదాపుగా అన్ని ఉపాధ్యాయ సంఘాలతో పాటు .. వామపక్షాలకు చెందిన వివిధ కార్మిక ట్రేడ్ యూనియన్లతో మంచి సంబంధాలు ఉన్నాయి . ఆజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా .. ఆయన అందుబాటులో ఉంటారు.


అందుకే ఆయా సంఘాలకు చెందిన పట్టణంలో ఓట్లు అన్ని .. గంప గుత్తగా లక్ష్మణరావుకి పడే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు . దీనికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలో ఉన్న సమయంలో తమకు అనుకులంగా ఉన్న అందరినీ విస్తృతంగా పట్టభద్ర ఓటర్లుగా నమోదు చేసింది . ఇప్పుడు ఈ ఓట్లు కూడా ఏ.ఎస్. లక్ష్మణ్ రావుకు అనుకూలంగా పడే అవకాశం ఉంది . ఏది ఏమైనా వైసీపీ బరిలో లేకపోయినా.. వారి ఓటు బ్యాంకు మొత్తం లక్ష్మణరావుకు అదనపు బలం కానుంది . ఇలాంటి నేపథ్యంలో ఆలపాటి రాజా గెలుపు కోసం అష్ట కష్టాలు పడుతున్నారు అన్నది కృష్ణ, గుంటూరు జిల్లా రాజకీయ వర్గాలలో వినిపించే టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: