
ఏపీ బిజెపిలో ఇద్దరి నేతల కుమ్ములాట .. కొత్త పంచాయితి..
అయితే.. సీఎం రమేష్ అనకాపల్లి నుంచి బిజెపి తరఫున ఎంపీగా గెలిచారు . కాంట్రాక్ట్, ఇతర వ్యవహారాల్లో రమేష్ దూకుడుగా ఉన్నారు . రమేష్ అనకాపల్లి ఎంపీగా ఉన్న సొంత జిల్లా కడపలోను తనదే పై చేయిగా ఉండాలని ఉద్దేశంతో అక్కడ కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదికి చెందిన అనుచరులపై ఏకంగా కడప జిల్లా ఎస్పీ కలెక్టర్‌కు లేఖ రాసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆది ఫామ్ హౌస్‌లో పేకాట శిబిరాలు, మట్కా శిబిరాలు నడుస్తున్నాయనేది సీఎం రమేష్ ఆరోపణ. దీంతో పోలీసులు గత నాలుగు రోజుల నుంచి ఇక్కడ టికెట్ ఏర్పాటు చేయడంతో పాటు.. ఆదినారాయణ రెడ్డి వర్గీలను అరెస్టు చేశారు.
అయితే ఆదినారాయణ రెడ్డి మాత్రం కేంద్రంలోని బిజెపి అధిష్టానానికి.. సీఎం రమేష్ పై ఫిర్యాదులు చేస్తున్నారట. రాష్ట్ర స్థాయిలో ఆది.. ఎన్ని ప్రయత్నాలు చేసినా రమేష్ దూకుడుని కట్టడి చేయలేకపోతున్నారన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర బిజెపి పెద్దలకు తన గూడు మొరపెట్టుకున్నారట. తన నియోజకవర్గంలో ఎక్కడో ఎంపీగా ఉన్న రమేష్ వేలు పెడుతున్నారని.. తన వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు అన్నది ఆదినారాయణ రెడ్డి ఆరోపణగా తెలుస్తోంది. అయితే సీఎం రమేష్ మాత్రం అసాంఘిక వ్యవహారాలపైనే తాను ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ ఇద్దరు నాయకుల ఫైటింగ్ .. ఏపీ బీజేపీలో కొత్త పంచాయతీకి తెరలేపినట్లు అయింది.