
మా చర్చలు ఉక్రెయిన్ తో.. జెలెన్ స్కితో కాదు.. పుతిన్ షాకింగ్ కామెంట్స్?
అయితే, దీనికి సమాధానంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు సాధ్యమేనని, అయితే, జెలెన్‌స్కీతో తాము చర్చలకు రావడం అసాధ్యమని తేల్చి చెప్పేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "ఉక్రెయిన్‌తో చర్చలు జరిపి రాజీకి రావాలనుకుంటున్నాం. కానీ, ప్రస్తుత అధ్యక్షుడితో అది చాలా కష్టం. మా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ముందుకు సాగుతాం. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు సహాయాన్ని నిలిపివేస్తే, ఈ యుద్ధం 2 నెలల్లోనే ముగుస్తుంది!" అని పుతిన్ వ్యాఖ్యానించారు.
మరలా ఇదే విషయమై రష్యా అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందిస్తూ... "పుతిన్ వద్ద ప్రపంచ స్థిరత్వాన్ని దెబ్బతీయగల శక్తి ఉన్నప్పటికీ, బలమైన నాయకుల ఒత్తిడిని మాత్రం అతను ఎదుర్కోలేడు. అందుకే మనం ఐక్యంగా, వ్యవహరించాలి. శాంతిని కోరేవారంతా కలిసి రష్యాపై ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడు మాత్రమే నిజమైన శాంతిని సాధించగలం!" అంటూ జెలెన్‌స్కీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పటికే పలుమార్లు ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగిస్తానని ప్రకటించిన సంగతి విదితమే. ట్రంప్ మాట్లాడుతూ... "నేనుంటే అసలు అసలు ఈ యుద్ధం స్టార్ట్ అయ్యేదే కాదు. ఇక దీనిని త్వరలోనే ముగింపు పలుకుతాను. శాంతి చర్చలకు ఇరుదేశాల నాయకులు ముందుకు రావాలి. రష్యా చర్చలకు అంగీకరించకపోతే, వారికి గట్టి ఆంక్షలు విధిస్తాను!" అని హెచ్చరించారు.