
ఏపీ: ప్రజలను నమ్మించి మోసం చేసిన సీఎం.. డిప్యూటీ సీఎం..!
ఇప్పటికే చాలామంది నేతలను ప్రజలు కూడా ట్రోల్ చేస్తూ ఉండగా.. అమ్మ ఒడి పథకాన్ని గత ఏడాది డిసెంబర్ కి ఇచ్చేస్తామన్నారు కానీ జనవరి వచ్చింది.. బడ్జెట్లో కూడా 6000 కోట్లు కేటాయించారు.. అన్నదాత సుఖీభవ (20,000) అని కూడా ఈ నెలలో వేసేస్తామని చెప్పిన..తాజాగా ఇప్పుడు జనం ముందుకు వచ్చి చంద్రబాబు రాష్ట్ర ఆదాయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని..మాట తప్పడం ఇష్టం లేక ప్రజలకు నిజం చెబుతున్నానని.. ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేస్తామంటూ తెలిపారు. గత ప్రభుత్వం వల్లే ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అయ్యిందంటూ తెలిపారట.
పోలవరం, అమరావతి, విశాఖ వంటి స్టీల్ ప్లాంట్ వంటి నిధులను మళ్ళించలేమంటూ తెలిపారట.. అయితే వీటన్నిటి నుంచి డబ్బులు ఎలా మళ్ళించడానికి అవ్వదట. 14 నర కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయని చెప్పి ఈ హామీలను ఇచ్చి.. అధికారంలోకి వచ్చి ఏడాది కాబోతోంది.. అయినా చెయ్యకపోగా.. గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా దిగిపోయినప్పుడు కూడా ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అమలు చేశారు.. జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఎక్కినప్పుడు 100 కోట్ల రూపాయలతో ప్రభుత్వాన్ని నడిపించారు జగన్మోహన్ రెడ్డి.. నవరత్నాలు అనేవి ఎలాంటి సందర్భాలలోనైనా సరే ఆగిపోలేదు.. మరి చంద్రబాబు మళ్ళీ పవన్ కళ్యాణ్ తో కలిసి ఏపీ ప్రజలను మోసం చేశారని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు చెబుతున్న వాస్తవాలను ప్రజలు నమ్ముతారా లేదో చూడాలి.