ఏపీ: కూటమి ప్రభుత్వానికి షాక్..సచివాలయ ఉద్యోగులు ఉద్యమ బాట..!
తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాలంటరీలని పట్టించుకోలేదని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఆరు నెలలకు పైగా కొన్ని చోట్ల వాలంటరీలు ధర్నాలు చేస్తున్నారట. అయినా కూడా కూటమి ప్రభుత్వం ఎక్కడ సానుకూలం చూపించలేదట. అయితే ఇప్పుడు తాజాగా రేషనలైజేషన్ పేరుతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులలో కీలకమైన మార్పులు కూటమి ప్రభుత్వం చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల సంఖ్య కుదింపు కూడా ఉంటుందని ప్రచారం ఎక్కువగా వినిపిస్తుంది.
ఈ రేషనలైజేషన్ వల్ల 2500 మందికి ఒక సచివాలయం ఉంటుందని అది కూడా 6 మంది మాత్రమే అందులో సిబ్బంది గా ఉంటారట. దీంతో ఒక్కసారిగా సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. అలాగే తమ జీవితాలు ఏమవుతాయని వారిలో వారు కలవర చెందడంతో ఆందోళన చెందుతున్నారట. అందుకు సంబంధించి ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసుకొని ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం సచివాలయ, గ్రామ ఉద్యోగుల మీద ఎలాంటి పక్షపాతం చూపిన కూడా కచ్చితంగా ఉద్యమించాలని నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.వైరల్ గా మారుతున్న ఈ విషయం మీద కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.