వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పేర్ని నాని ప్రస్తుతం చిక్కుల్లో ఉన్న సంగతి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో... కీలక పాత్ర పోషించిన పేర్ని నాని.. చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిసుకుంది. బియ్యం మాయం చేశారని ఆయన కుటుంబం పై చంద్రబాబు కూటమి ప్రభుత్వం కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 7700 బియ్యం బస్తాలు మాయమైనట్లు... పేర్ని నాని భార్య పైన కేసులు నమోదు అయ్యాయి.
ఇక ఈ బియ్యం మాయం కేసులో... ఏ క్షణమైనా ఆయన భార్య అరెస్టు అవుతారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో పెర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలు కూడా నిన్నటి వరకు రావడం జరిగింది. అయితే ఈ వార్తల నేపథ్యంలో స్వయంగా పేర్ని నానికి క్లారిటీ ఇచ్చారు. ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి... బియ్యం దందా వెనుక ఉన్న రహస్యాలను పంచుకున్నారు.
వాస్తవంగా తన భార్య అరెస్టు కాకుండా కాపాడింది చంద్రబాబు నాయుడు అని.... ఈ విషయంలో ఆయన తనకు హెల్ప్ చేసినట్లు పేర్ని నాని మీడియా ముందే ప్రకటించేశారు. వాస్తవంగా బియ్యం స్కామ్ లో... పేర్ని నాని భార్యను అరెస్టు చేయాలని ఏపీ మంత్రి డిమాండ్ చేశారట. ఈ విషయాన్ని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారట ఏపీ మంత్రి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం... ఆ మంత్రికి చురకలు అంటించి పంపించారట.
ఏదైనా కోపం ఉంటే పెళ్లి నాని పైన తీర్చుకోవాలి కానీ ఆయన భార్య పైన కాదు... అంటూ హెచ్చరించారట. అయితే ఈ విషయాన్ని తాజాగా మీడియా ముందు తెలిపారు పేర్ని నాని. కక్షగట్టి తనపై ఆ మంత్రి వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. అయితే పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై కొల్లు రవీంద్ర స్పందించడం గమనార్హం. తప్పు చేస్తే ఆడవాళ్ళు అయితే ఏంటి? ఎవరినైనా అరెస్టు చేస్తామని ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో కొల్లు రవీంద్ర గురించే పేర్ని అని చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.