పార్సిల్ లో గంజాయి.. తీగల ఆగితే విశాఖపట్నం పాడుబడ్డ ఇల్లు కదిలింది..?

praveen
మనదేశంలో గంజాయి సాగు, రవాణా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. పోలీసులు ఈ మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా వారు ఎంతోమంది స్మగ్లర్లను పట్టుకోగలుగుతున్నారు. అయితే ఈ స్మగ్లర్లు పోలీసులకు దొరక్కుండా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. పోలీసులు కూడా వారి కంటే తెలివిగా వ్యవహరిస్తూ ఏదో ఒక సందర్భంలో పట్టేసుకుంటున్నారు. ఇటీవల స్మగ్లర్లు డ్రై ఫ్రూట్స్ లాగా గంజాయిని ప్యాక్ చేసి తరలించారని ప్రయత్నించారు. కానీ రైల్వే పోలీసులు ఆ విషయాన్ని పసిగట్టేశారు. తీగ లాగితే డొంకంతా కదులుతుందని పేషన్స్ గా ఉండి చివరికి ఆ గుడ్డును రట్టు చేసేసారు. సిటీలో చాలా చాకచక్యంగా స్మగ్లర్ల కదలికలను గమనిస్తూ విశాఖలోని ఒక శిధిలావస్థలో ఉన్న ఇంట్లో కుప్పలు తెప్పలుగా గంజాయి ఉన్నట్టుగా కనిపెట్టారు.
కొరియర్ సర్వీస్ ద్వారా ఈ గంజాయిని దేశంలోని వివిధ ప్రాంతాలకు సీక్రెట్ గా తరలిస్తున్నట్లు నిర్ధారించారు. అయితే ఈ వ్యవహారం బయటపడడానికి ఢిల్లీకి పంపిన ఒక గంజాయి కొరియరే కావడం విశేషం. అసలు ఈ కొరియర్ విశాఖపట్నంలోని పాడు పడ్డ ఇంటికి ఎలా దారి చేసింది అంటే.. ఒక స్మగ్లర్ అనేవాడు ఒక పార్సిల్ సర్వీస్ లో గంజాయి ప్యాకెట్ ఇచ్చాడు. అయితే పార్సెల్ బాయ్ దానిపై రాసి ఉన్న అడ్రస్సు అనేది తప్పుగా ఉన్నట్టు గమనించాడు. దాన్ని ఎవరికి అందించాలో తెలియక చివరికి విశాఖపట్నంలోని పార్సిల్ సంస్థకు దీని గురించి తెలియజేశాడు.
దాంతో వాళ్లు తమకే తిరిగి పంపేయమని చెప్పగా అలానే చేశాడు. పార్సెల్ సర్వీస్ వాళ్లు దానిని పోలీసులకు అప్పచెప్పారు. తెరిచి చూస్తే అందులో ఏముంది? గంజాయి! అంతే పోలీసులు ఒక్కసారిగా దెబ్బ తిన్నారు. ఎంత తెలివి మీరారు రా మీరు అనుకుంటూ వారు బరిలోకి దిగి శ్రీహరిపురం లోని 60 వ వార్డు ఎంఐజి 1.. 22-65-5-22 క్వార్టర్ అడ్రస్ నుంచి ఆ పార్సిల్ పంపినట్లు గుర్తించారు. అక్కడికి వెళ్తే వారికి మరో షాక్ తగిలింది. ఎందుకంటే అదొక పాడుబడ్డ ఇల్లు. అందులో మాత్రం భారీ ఎత్తున గంజాయి కనిపించింది. ఎలాంటి అనుమానం రాకుండా బయటికి అదలా కనిపించింది కానీ లోపలికి వెళ్లేసరికి పోలీసులకు దిమ్మతిరిగినంత పని అయింది. ఇక్కడ 100 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని మరిన్ని వివరాల కోసం ప్రయత్నించారు. అప్పుడు వారికి యజమాని ఈ ఇంటిని తొమ్మిది వేలకు బిహారి వ్యక్తులకు అద్దెకి ఇచ్చినట్లుగా తెలిసింది. ఇప్పుడు వారిని పట్టుకునే పనిలో పడింది పోలీస్ టీం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: