ఏపీ: చంద్రబాబు స్కెచ్.. జనసేన పార్టీకి చెక్ పెట్టడానికేనా..?

frame ఏపీ: చంద్రబాబు స్కెచ్.. జనసేన పార్టీకి చెక్ పెట్టడానికేనా..?

Divya
టిడిపి అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న కూడా వాటి వెనక రాజకీయ హస్తమే ఉంటుంది.. ముఖ్యంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి సీఎం చంద్రబాబు నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తను తీసుకొనే నిర్ణయాలు సైతం పార్టీ బలోపేతం అవ్వడానికి అవతల వ్యక్తులను సైతం బలహీనపరచడానికి కారణం అవుతుందనే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. చంద్రబాబు అధికారంలో ఉన్న లేకపోయినా ఆయన అంచనా వేయడం సాధ్యం కాదని చాలామంది నేతలు చెబుతూ ఉంటారు.

చంద్రబాబు నిర్ణయాలు ఎవరికి నచ్చకుండా నచ్చకపోయినా లెక్క చేయరు. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న పరిణామాలను గమనిస్తే ఆయన వేసిన స్కెచ్ అదిరిపోయిందని పలువురు టిడిపి నేతలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కూటమిలో మూడు పార్టీలుగా కలిసే ఉన్నాయి  టిడిపి జనసేన బిజెపి కలిసి ఉండడంతో తిరుగులేని శక్తిగా మొన్నటి ఎన్నికలలో అధికారం రాబట్టగలిగాయి. కానీ రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయి ఊహించలేము కాబట్టి ఎవరు ఎటుగా వెళతారో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. సీఎం చంద్రబాబు కూడా ఎవరి రాజకీయాన్ని అంత సులువుగా నమ్మే వ్యక్తి కాదు అని చెప్పవచ్చు.

ఇప్పుడు సన్నిహితంగా ఉన్నవారు రేపు వ్యతిరేకంగా కూడా మారవచ్చు. ముఖ్యంగా కూటమి కూడా ఎంత కాలం కొనసాగుతుందో ఎవరు చెప్పలేరు.  కూటమిగా ఉన్న బిజెపి పార్టీ మోడీ వ్యూహాలు ఎలా మారుతూ ఉంటాయో చెప్పడం కష్టం.దీనికి తోడుగా బీజేపీ ఎలా చెబితే జనసేన పార్టీ కూడా అలాగే మారుతూ ఉంటుంది. అందుకే ప్రస్తుతం కాపు సామాజిక వర్గం నేతలతో టీడీపీ నింపేయాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారట చంద్రబాబు. అందుకే వైసీపీలో ఉండేటువంటి కాపు సామాజిక వర్గం నేతలను తమ పార్టీలోకి సరిత చేర్చుకొని మరి బలపడడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారట ఒకవేళ పవన్ కళ్యాణ్ తమకు దూరమైన భవిష్యత్తులో ఈ సామాజిక వర్గం నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఇలా చేస్తున్నట్లు సమాచారం.. ఇందులో భాగంగా అవంతి శ్రీనివాస్, ఆళ్ల నాని, గాంధీ శ్రీనివాస్ వైసీపీ పార్టీకి రాజీనామా చేయించి మరి తమ పార్టీలో చేర్చుకున్నారు అన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ఆలోచన లోకేష్ కి వచ్చిందని పలువురు టిడిపి నేతలు తెలియజేస్తున్నారు. మరి ఎన్నికల ముందు ఈ కాపు నేతలు ఎవరి వైపు ఉంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: