కరోనా తరహాలో.. ముంచుకొస్తున్న మరో ప్రపంచ విపత్తు.. డాక్టర్లు వార్నింగ్?
ఇక H5N1 వ్యాధి మనిషికి అత్యంత తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది సాధారణంగా పౌల్ట్రీ సహా అడవి పక్షులు, క్షీరదాలు, మరియు అనేక జాతులకు మనకి సోకుతుంది. మానవులకు వ్యాపించిన కేసులు చాలా అరుదుగా ఉన్నప్పటికీ, వైరస్ మనుషుల మధ్య సులభంగా వ్యాపించేలా పరివర్తన చెందుతుందని అంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఇది మరో మహమ్మారిగా రూపుదాల్చుకుంటోంది అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బ్రిటీష్ కొలంబియా, కెనడా, కాలిఫోర్నియా, యూఎస్ వంటి దేశాల్లో రోజురోజుకీ దీని బారినపడి అనేకమంది మరణిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
2024 నవంబర్‌లో బ్రిటిష్ కొలంబియాలోని ఫ్రేజర్ హెల్త్‌కి చెందిన ఒక యువకుడికి H5N1 ఉన్నట్లు నిర్ధారణ కాగా తాజాగా కెనడాలో స్థానికంగా H5N1 కేసు ఒకటి నమోదు అయింది. సదరు యువకుడిలో కండ్లకలక, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపించిన తరువాత తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తలెత్తాయని సమాచారం. కాగా ఇది ఆ యువకుడికి ఎలా సోకిందో ఆరోగ్య అధికారులు గుర్తించలేకపోయారు. ఎందుకంటే... ఆ ప్రాంతంలో పౌల్ట్రీ ఫామ్ అనేది లేదు. కానీ అడవి మాత్రం ఉంది. తదుపరి విశ్లేషణలో వైరస్ మానవులకు వ్యాపించేలా మ్యుటేషన్‌లను కలిగి ఉందని నిర్దారణకు వచ్చారు. PB2-E627K మ్యుటేషన్ అనేది మానవ కణాల్లో వైరల్ రెప్లికేషన్‌ను పెంచుతుంది. ఇదే ఆ రోగిలో కనిపించినట్లు కనుగొన్నారు. అంతకు మునుపు చాలా H5N1 కేసులు వ్యవసాయ కార్మికులకు పక్షుల నుంచి సోకినట్లు తేలింది. అలా కాలాను క్రమంలో ఇవి మానవుల నుంచి మానవులకు వ్యాప్తి చెందే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు.