ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఇప్పుడు ఎంతగానో మండిపడుతున్న మెగా ఫ్యాన్స్.. గతంలో బన్నిని కూడా మెగా కుటుంబంలో ఓ స్టార్ హీరోగా భావించేవారు.. బన్నీ సినిమాలకు భారీగా పబ్లిసిటీ చేసి ఆయన సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు... అయితే కేవలం గత ఎన్నికలలో పవన్ కల్యాణ్ కి మద్దతు ఇచ్చి తన స్నేహితుడు వైసీపీ అభ్యర్థి అయినా శిల్పా రవి గెలుపు కోసం ప్రచారం చేయడం మెగా ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది.. అప్పటి వరకు ఎంతగానో కలిసి వున్న ఫ్యాన్స్ ఆ చిన్న ఘటనతో అల్లు vs మెగా ఫ్యాన్స్ గా విడిపోయారు..అల్లు అర్జున్ మద్దతు ఇచ్చిన శిల్పా రవి గతంలో పవన్ కల్యాణ్ ని దారుణంగా విమర్శించారు.. దీనితో మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా మారారు.. 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం, అల్లు అర్జున్ మద్దతు ఇచ్చిన శిల్పా రవి ఓడిపోవడంతో మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేసారు..
గతంలో కూడా అల్లు అర్జున్ సినిమా ఈవెంట్స్ లో మెగా ఫ్యాన్స్ పదే పదే పవన్ కల్యాణ్ గురించి చెప్పాలి అంటూ ఇబ్బంది పెడుతుండగా చెప్పను బ్రదర్ అంటూ బన్నీ కాస్త ఘాటుగా స్పందించారు.. డానికి కారణం సినిమా విషయం కంటే మిగిలిన విషయాలకి ఫుల్ పబ్లిసిటీ వస్తుందని దీనితో సినిమా ప్రేక్షకులకి అంతగా రిసీవ్ అవ్వదని ఆ రోజు బన్నీ అలా మాట్లాడారు..అయితే ప్రస్తుతం ఈ ఘటన అల్లుఅర్జున్ ని మెగా ఫ్యామిలీ నుండి దూరం చేసింది.. శిల్పా రవికి మద్దతు ఇవ్వడంతో వైసీపీ పార్టీ అల్లుఅర్జున్ ఓన్ చేసుకుంటుంది.. పుష్ప 2 సినిమాపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉంటే వైసీపీ పార్టీ మాత్రం ఆ సినిమాకు ఫుల్ ప్రమోషన్ చేస్తుంది.. వైసీపీ బ్యానర్స్ లో పుష్ప 2 బొమ్మ వేయడం, సాక్షి పేపర్ లో ఆ సినిమా కోసమే స్పెషల్ స్టోరీ రాయడం వంటివి వైసీపీ అల్లు అర్జున్ ని ఓన్ చేసుకుంటున్నట్లు అర్ధమవుతుంది.. పవన్ కి వ్యతిరేకంగా బన్నీ ఉండటమే దీనికి కారణం అని తెలుస్తుంది..