
ఏపీ: ప్రజలకు మరో పిడుగు లాంటి వార్త.. స్మార్ట్ మీటర్స్ దెబ్బపడేనా..?
ఈనెల 13వ తేదీ నుంచి మూడు దశలవారీగా పోరాటానికి విద్యుత్ బారాల మీద ఉద్యమిస్తామంటూ తెలియజేశారు వైసీపీ నేతలు.. అలాగే కాంగ్రెస్ కూడా ఈ విషయం పైన త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామంటూ తెలియజేశారు. ఇదంతా ఇలా ఉండగా ఈ సమయంలోనే ఇప్పుడు మరొకసారి ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మీటర్ల ప్రయోగానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం బెడిసి కొడుతుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది విద్యుత్ మీటర్ల సంస్కరణకు నాంది అయితే ఈ సంస్కరణలకు సైతం ప్రజల నుంచి ఏ మేరకు మద్దతు ఉంటుందో తెలియదని కానీ జనం నెత్తిన ఇది గుదిబండగా మారుతుందని చాలామంది నేతలు విమర్శిస్తున్నారట. ఇప్పటికే ఎలాంటి పథకాలు కూడా అందించకపోవడంతో చాలామంది ప్రజలు విసిగిపోతున్నారని ఇలాంటి సమయంలో మరి ఇలాంటి భారాన్ని మోపితే కచ్చితంగా ఎదురు తిరుగుతారని టాక్ వినిపిస్తోందట.
ఇక స్మార్ట్ మీటర్లను బిగించడం వల్ల ప్రతినెల ఎంత బిల్లు వస్తుందో అన్న భయాలు అయితే ఇప్పుడు సామాన్యులలో కలుగుతోంది .పైగా ఇది ప్రీపెయిడ్ విధానంలో కూడా ఉండబోతుందని నెలకు ఎన్ని యూనిట్ వాడతారో అంచనాలకు వచ్చిన తరువాతే మనం చెల్లించాల్సి ఉంటుందని.. ప్రీపెయిడ్ విధానంలో రీఛార్జ్ కనుక చేయకపోతే ఆ వెంటనే ఆ ఇంట్లో కరెక్ట్ కనెక్షన్ కూడా పోతుందట. విద్యుత్ బిల్లు చెల్లించకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కొంత సమయాన్ని ఇస్తారు.. కానీ కరెంటు మాత్రం కట్టవదు.. ఈ మీటర్లతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు.. దీనివల్ల కూడా కూటానికి ప్రభుత్వం పైన మరింత వ్యతిరేకత మొదలవుతుందని పలువురు కూటమి కార్యకర్తలు కూడా తెలియజేస్తున్నారు. విశాఖలో మొదట స్మార్ట్ మీటర్లు బిగించబోతున్నారని.. రాయలసీమలో కూడా నంద్యాలలో ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయబోతున్నారట. మరి వీటి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.