ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుల అరాచకాలకు చెక్!

praveen
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుల అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈయన అనుచరుడు వంశీనాథ్ రెడ్డికి టీటీడీ అధికారులు రాచ మర్యాదలు చేసినట్లుగా తెలిసింది. అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి కూడా అరాచకాలకు తెగబడుతున్నట్లుగా టీడీపీ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోని సంగారెడ్డి పోలీసులు ఎంపీ అవినాష్ అనుచరుల ఆధీనంలో ఉన్న కార్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, అవినాష్ అనుచరుడైన, వికారాబాద్ కి చెందిన మనీ రాజ్ 2020లో హరిహర ట్రావెల్స్ సంస్థ యజమాని సతీష్ దగ్గర ఆరు కారులను అద్దెకు తీసుకున్నాడు.

అలా అద్దెకి తీసుకున్న ఆరు కార్లను అవినాష్ అనుచరులు వాడుకోవడం మొదలుపెట్టారు అదే చెల్లించాలని అడిగితే ఇవ్వలేదు. కార్లను తిరిగి ఇవ్వాలని సతీష్ అడగ్గా చంపేస్తామని బెదిరించారు. చివరికి చేసేదేమీ లేక సతీష్ మూడేళ్ల సంగారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. అయితే ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కార్లు ఎక్కడున్నాయో తమకు తెలియడం లేదని చేసిన పెండింగ్లో పెట్టారు. ఎంతకీ తనకు న్యాయం జరగకపోవడంతో సతీష్ ఏపీ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందగానే పులివెందుల పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఆ పోలీసులు ఆ ఆరు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

అంతే కాదు వాటిని తిరిగి సంగారెడ్డి పోలీసులకు పంపించారు. సంగారెడ్డి పోలీసులు కార్లను యజమానికి అప్పజెప్పారు. చాలా డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసిన తన కార్లు ఎట్టకేలకు తిరిగి తనకు దక్కడంతో సతీష్ చాలా సంతోషించారు.ఇదంతా ఏపీ ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్లే జరిగిందని తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సాయంతోనే ఇది సాధ్యమైంది అన్నారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ కేసు వ్యవహారంలో త్వరలోనే నెక్స్ట్ స్టెప్ తీసుకునే అవకాశం ఉంది. ఆ అనుచరులకు తగిన శిక్ష విధించడమే కాకుండా కారు ఓనరు సతీష్ కు జరిగిన నష్టాన్ని వారిచేతే చెల్లించేలాగా చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: