అమరావతి రాజధాని కోసం మళ్లీ అప్పు.. ఈసారి ఏకంగా..?
అప్పట్లో అలాంటిది ఏమీ లేదు రాజధాని అమరావతికి సెల్ఫిమెట్ ప్రాజెక్ట్ అని... ప్రపంచ బ్యాంకు నుంచి 15వేల కోట్లు.. హక్కో నుంచి 11 వేల కోట్లు మొత్తం 26 వేల కోట్లు అయింది.. అయితే ఇప్పుడు తాజాగా అమరావతికి కొత్త ఊపు అంటూ ఏపీ ప్రభుత్వం ఊదరగొడుతోంది. ఏంటయ్యా ఆ కొత్త ఊపు స్పెషాలిటీ అంటే.. ఏపీ రాజధాని నిర్మాణానికి మరో 16 వేల కోట్ల రూపాయలు రుణం అంటూ ముందుకొచ్చినటువంటి హక్కో ముందుకు వచ్చిన జర్మనీ బ్యాంక్ కెఎఫ్ డబ్ల్యు.. దీంతో మొత్తం మీద ఇప్పటికే 40 వేల కోట్ల రూపాయలు అమరావతికి ఖర్చవుతుంది.
అప్పులతోనే ఆరంభమైన రాష్ట్రానికి అప్పులతోనే రాజధాని కూడా ఉంటుందని పలువురు విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు.. అయితే ఈ అప్పులను తీర్చడానికి ఎన్నేళ్లు అవుతుందనే విషయం చెప్పడం కష్టమేనని నిపుణులు తెలుపుతున్నారు.. ఈ అప్పులకు సంబంధించిన అమౌంట్ వచ్చేసరికి.. రెగ్యులర్ ఎఫ్ ఆర్ బి ఎం రూపంలో కాకుండా చూపించడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి ముందుకు రావడమే ఇక్కడ కీలకమైన పాయింట్ అన్నట్లుగా పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్పులలో ఉందని తెలియజేస్తున్న కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మించడానికి మరి ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయో చూడాలి.