ఏపీ: ఈవీఎంల గురించి నిజాలు చెప్పేసిన వైసిపి మహిళ నేత..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ హాట్ టాపిక్ గా ఉంటూనే ఉన్నాయి.. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం గెలిచిన అటు వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారనే విధంగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. అయితే కూటమి గెలుపులో ఏదో మతక ఉందని ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయనే విధంగా ఇప్పటికే చాలామంది వైసిపి నేతలు ఆరోపించడం జరిగింది.. అయితే వీరే కాకుండా ఇతర రాష్ట్రాలలోని నేతలు, ముఖ్యమంత్రులు కూడా ఈ విషయం పైన ఈవీఎంల పైన మాట్లాడటం జరిగింది.

అయితే ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి అయిన వైసీపీ మహిళా నేతగా పేరుపొందిన రోజా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఈ ఈవీఎంల గురించి నిజాలు చెప్పడం జరిగింది. 2019లో తాము గెలిచినప్పుడు ఈవీఎంలు..VVPT స్లిప్పులు సైతం ఆరు నెలల వరకు ఉంచాము.. ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత ఆరు నెలల వరకు ఉండాలని.. ఎవరు కేసు వేసినా కూడా ఆ అనుమానాన్ని సైతం క్లియర్ చేయవలసి ఉంటుందని తెలిపింది. ఆ వివిప్యాడ్స్ తీసి కౌంటింగ్ చేసి చూపించాలని తెలిపింది.

కానీ 2024లో ఎన్నికలు జరిగిన తర్వాత పది రోజులకే వాటిని డిస్ట్రాయ్ చేయమని క్లియర్ గా ఆర్డర్ ఇచ్చి డెస్ట్రాయ్ చేశారని అందుకే అనుమానాలకు దారితీస్తోందంటూ తెలిపింది. మరొకటి ఏమిటంటే.. ఎప్పుడైనా సరే ఈవీఎంలు అనేవి మిషన్ ఏ కదా.. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రోజున ఎన్ని ఓట్లు  పోలయ్యాయనే విషయాన్ని ఆన్లైన్లో పెట్టారో.. ఏ జిల్లాలలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఏ నియోజకవర్గాలలో ఎన్ని ఓట్లు పోలయ్యాయనే విషయంపై.. అది రికార్డెడ్ గా ఉంటుంది.. అయితే ఆరోజు పోలైన ఓట్లకి కౌంటింగ్ రోజున పోలైన ఓట్లకి.. తేడా చూస్తే 45 లక్షల ఓట్లు పెరిగాయని తెలిపింది. అందుకే దానిమీద కోర్టులో కేసు కూడా వేయడం జరిగిందని తెలిపింది రోజా. ఎక్కడైనా సరే 45 లక్షల ఓట్లు ఎలా పెరుగుతాయి.. పోలైన ఓట్లకి.. కౌంటింగ్ ఓట్లకి 45 లక్షలు తేడా ఉందని తెలిపింది. ఇలా EVM స్ పైన షాకింగ్ కామెంట్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: