జ‌నసేన‌కు మ‌రో ప‌దేళ్లు వెయిటింగ్ త‌ప్ప‌దా.. ?

RAMAKRISHNA S.S.
జనసేన నాయకులు మరో 10 ఏళ్లపాటు ఎదురుచూపులు చూడాల్సిందే. ఈ ఎదురుచూపులు దేనికి అనుకుంటున్నారా ? పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకు రెండు నెలల ముందు జనసేన పార్టీని స్థాపించారు. అయితే ఆ ఎన్నికలలో పోటీ చేయలేదు బిజెపి - తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు పలికారు. కూటమి అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికలకు వచ్చేసరికి పవన్ బిజెపి - టిడిపి టిడిపికి దూరమై ఒంటరిగా పోటీ చేసి చివరకు తాను కూడా సొంతంగా ఎమ్మెల్యేగా గెలవలేదు. పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలో ఓడిపోయారు. అనంతరం ఓటమి తర్వాత కొద్ది నెలలకే బిజెపితో జట్టు కట్టారు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి బిజెపి - టిడిపి - జనసేన మూడు పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేసి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క ఎమ్మెల్యే .. రెండు ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. అయితే జనసేన అభిమానులు 2019లోనే తమ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. పవన్ కూడా 2019 ఎన్నికలలో తన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కానిస్టేబుల్ కుమారుడు ముఖ్యమంత్రి కాకూడదా ? అని ప్రశ్నించడం ద్వారా జనసేన కేడర్ ఆశలను మరింత పెంచారు. 2019 - 2024 వరకు ఎన్నికలలో జనసేన క్యాడర్ ఎంత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికలలో జనసేన కేడ‌ర్ బాగా రెచ్చిపోయి మరీ పనిచేశారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు చంద్రబాబుతో కలిసి ఉంటే వచ్చే ఎన్నికల నాటికి అయినా పవన్ ముఖ్యమంత్రి అవుతారన్న ఆశలు జనసేన వాళ్లకు అస్సలు లేవు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఇలాగే బలంగా రాజకీయాల్లో కొనసాగి పోరాటాలు చేస్తే మరో 10 ఏళ్ల తర్వాత కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: