వైసీపీలో ఈ నాయ‌కుల‌ను జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టాల్సిందే... !

RAMAKRISHNA S.S.
- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .
వైసీపీలో ఒక్కొక్కరుగా అసంతృప్తి నాయకులు కూటమి కడుతున్నారు. వనభోజనాల ఏర్పాటు పేరుతో పలు జిల్లాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలలో వైసీపీ నాయకులు ఒకే చోట సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంగా కర్నూలు - అనంతపురం - కడప - రాజమండ్రి తో పాటు పలు ప్రాంతాలకు చెందిన నాయకులు తమ గళం వినిపిస్తున్నారు. వీరు డిమాండ్ ఒక్కటే వైసీపీలో కొందరు నాయకులను పక్కన పెట్టాలని నేరుగా జగన్ బాధ్యతలు చూడాలని వీరంతా కోరుతున్నారు. జగన్ జిల్లాలు వారీగా కొందరు ఇన్చార్జిలను నియమిస్తున్నారు .. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో జగన్ ఇప్పటికీ పట్టించుకోవడం లేదు.

ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించి తప్పుకుంటున్నారు.. ఇది సరికాదు .. ఇలా ఉంటే మాతోపాటు మా కేడర్ కూడా ఇబ్బంది పడుతోంది అని తూర్పుగోదావరి జిల్లా సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాకు చెందిన మరో కీలక రెడ్డి నేత కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీలో ఇప్పుడున్న వారిని మార్చాలని డిమాండ్ చేసిన ఆయన మెజార్టీ నాయకులు మాట కూడా ఇలాగే ఉందని చెప్తున్నారు. సీనియర్ నాయకుల నుంచి జూనియర్ల వరకు కూడా అందరూ మార్పు తీసుకునే అడుగులు వేస్తున్నారు. ఇంతకీ వీరు కోరుతుంది ఏంటంటే ఇటీవల జిల్లాలకు కోఆర్డినేటర్ గా ఆరుగురికి జగన్ బాధ్యతలు అప్పగించారు.

మొత్తం ఉమ్మడి 13 జిల్లాలకు ఆరుగురిని కోఆర్డినేటర్లుగా నియమించారు. వీరిలో కొందరు విషయంలో మార్పు కావాలనేది వీరి డిమాండ్. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి - వైవి సుబ్బారెడ్డి - మిథున్ రెడ్డి వంటి వారిని మార్చాలని అందరూ కోరుతున్నారు.. అంతేకాదు బొత్స‌ సత్యనారాయణ వంటి వారిపై కూడా సొంత నేతల నుంచి అసంతృప్తి రగిలిపోతుంది. ఇలాంటివారిని పక్కన పెట్టకపోతే పార్టీ నాయకులకు జగన్‌కు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయి పార్టీ ఘోరంగా నష్టపోతుందని వారు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: