పోసానికి.. జగన్కు ఎక్కడ చెడింది... అందుకే దండం పెట్టేశాడా... ?
ప్రముఖ సినీ నటుడు రచయిత దర్శకుడు పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన నటన తనదైన డైలాగ్ డెలివరీ తనదైన మాట తీరుతో ఎంతోమంది అభిమానుల మనసులను సొంతం చేసుకున్నాడు పోసాని కృష్ణ మురళి. అయితే పోసానికి ఎక్కడ ఉన్నా ఎక్కువగా కాంట్రవర్సీ ఉంటూ వస్తోంది. పోసాని ఏదైనా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. సినిమాల్లోనే చాలా కాంట్రవర్సీలు ఉన్న పోసాని రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు పై .. ఆ పార్టీ నేతలకు తీవ్ర విమర్శలు చేస్తూ కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీ పై ఎన్నో విమర్శలు చేశారు. తనకు నచ్చని వారిపై చివరకు వారు సినిమా రంగంలో ఉన్న కూడా పోసాని విమర్శలు చేస్తూ వస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి వైసీపీకి సపోర్ట్ చేస్తూ వస్తున్న పాసానిని జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న గత ఐదేళ్లు పలు సందర్భాలలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు - లోకేష్ - పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. వాస్తవానికి పోసాని జగన్కు సపోర్టుగా ఉన్నందుకు చాలా పెద్ద పదవి వస్తుందని ఆశించారు .. ఆ పదవి రాలేదు. పోసాని స్థాయితో పోలిస్తే చాలా చిన్న పదవితో జగన్ సరిపెట్టేశారు. వైసీపీలో ఆలీకి కూడా అన్యాయమే జరిగింది. ఆలీ స్థాయికి తగిన పదవి రాలేదు. ఇప్పుడు వైసీపీ ఓడిపోయి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. పలువురు నేతలపై కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే పోసాని ఇక రాజకీయాలలో క్రియాశీలకంగా కొనసాగేందుకు ఇష్టపడటం లేదు.
ఈ క్రమంలోనే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఇకనుంచి తను రాజకీయాలు మాట్లాడను ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. పొగడను.. మాట్లాడను.. విమర్శించను.. ఎవరి గురించి తాను మాట్లాడను అని తేల్చి చెప్పారు. ఒక పార్టీని తిట్టాలని.. పొగడాలని రాజకీయాల్లోకి తాను రాలేదు. ఓటర్ లాగే ప్రశ్నించా మంచి చేస్తే వాళ్లకు సపోర్ట్ చేశా ... నా కుటుంబం పిల్లల కోసం రాజకీయాలు వదిలేస్తున్నా అని క్లారిటీ ఇచ్చేశారు. ఏది ఏమైనా జగన్ను నమ్ముకుంటే భవిష్యత్తు లేదు సరి కదా ఇబ్బందులు తప్పవు అన్న నిర్ణయానికి వచ్చి పోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టు అర్థమవుతుంది.