బిర్యానీతో బీర్లు కూడా ఉన్నాయ్..మరో వివాదంలో కొండా సురేఖ ?

Veldandi Saikiran
తెలంగాణ మహిళా మంత్రి కొండ సురేఖ వివాదంలో చిక్కుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి అయిన కొండా సురేఖ బీరు పార్టీ లో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. తాజాగా... తన ఇంట్లో ఒకరి పుట్టినరోజు వేడుక జరిగిందని... పార్టీ ఇస్తున్నట్లు కొండా సురేఖ ఈ వీడియోలో పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులతో సోషల్ మీడియాలో వీడియో కాల్ మాట్లాడారు కొండా సురేఖ.

ఈ సందర్భంగా బిర్యానీతో పాటు బీరు పార్టీ కూడా అరేంజ్ చేసినట్లు కొండా సురేఖ స్పష్టం చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా.. గులాబీ పార్టీ సోషల్ మీడియా ఈ వీడియోను తెగ వైరల్ చేస్తుంది.  ఇక ఈ వీడియోలో కొండా సురేఖ.. ఇంట్లోనే.. ఈ బీరు బిర్యానీ పార్టీ జరిగినట్టు తెలుస్తోంది. చాలామందిని బిర్యానీ పార్టీ కోసం పిలిచానని కొండా సురేఖ ఈ వీడియోలో స్పష్టం చేశారు.

అలాగే కొంతమందికి బీరు పార్టీ కూడా అరేంజ్ చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొండా  సురేఖ పై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి అయి ఉండి..  ఇలాంటి పనులు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికే సమంత అలాగే కేటీఆర్ విషయంలో ఇరుక్కున్న కొండా సురేఖ.. ఇప్పుడు బీరు బిర్యానీ పార్టీలో... దొరకడం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది.

అయితే మొన్నటికి మొన్న కేటీఆర్ బామ్మర్ది ఇంట్లో చిన్న పార్టీ అయితే నానా రచ్చ చేసిన.. పోలీసులు ఇప్పుడు కొండా సురేఖ ఇంట్లో బీరు పార్టీ జరిగితే స్పందించడం లేదని గులాబీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  కొండా సురేఖకు ఒక న్యాయం కేటీఆర్ కు ఒక న్యాయమా అంటూ మండిపడుతున్నారు. వెంటనే కొండా సురేఖ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కొండా సురేఖకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునేందుకు రెడీ అయినట్లు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: