అదానీ అవినీతి రికార్డుల్లో జగన్ పేరు... ఒక్క ఏపీ లంచాలే రు. 1680 కోట్లా ...?
వైసీపీ అధినేత .. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి చరిత్ర ఇప్పుడు అమెరికా కోర్టు రికార్డుల వరకు వెళ్ళింది. తాజాగా దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానిపై అమెరికాలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అందులోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తో పాటు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన విషయాలను కూడా ప్రస్తావించారు. విద్యుత్ సరఫరా ఒప్పందాల కోసం గౌతం అదాని 2021 లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసినట్టు అమెరికా కోర్టు తన నేర ఆరోపణలలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు 200 మిలియన్ డాలర్లు అంటే దగ్గర దగ్గర రు. 1680 కోట్ల వరకు లంచాలు తీసుకున్నట్టు అందులో పేర్కొన్నారు.
కోర్టు అభియోగం ప్రకారం చూస్తే గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా అప్పటి సీఎం జగన్ ను కలిసి 7000 మెగా ఓట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడానికి కావలసిన పలు విషయాలపై చర్చించినట్టు ప్రస్తావించారు. ఒప్పందం ప్రకారం అధికారులకు లంచాలు ఇవ్వటానికి కూడా ఆయన హామీ ఇచ్చినట్టు ఆ రికార్డుల్లో పేర్కొన్నారు. ఒడిస్సా విద్యుత్ సరఫరా ఒప్పంద కంటే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరా ఒప్పందానికి సంబంధించిన లంచం చాలా ఎక్కువ మొత్తం అని కూడా తెలిపారు. ఆదాని గ్రీన్ ఎనర్జీ రికార్డుల్లో కూడా ఈ విషయం స్పష్టంగా ఉంది అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెల్లించాల్సిన లంచం మొత్తం 200 మిలియన్ డాలర్లుగా ఆదాని గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ సంకేతాలు ఇచ్చారు అని తెలిపారు.
ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే ప్రధాని మోడీకి ఎంతో సన్నిహితుడుగా పేరు ఉన్న గౌతమ్ అదానీ దగ్గర అప్పుడు జగన్ సర్కారు కానీ అధికారులు కానీ ఇంత భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నది నిజమే అయితే ఇది పెద్ద సంచలనంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది పైనుంచి కింద వరకు అంతా తెలిసే జరుగుతుంది అన్న విషయం చెప్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం దీనిపై ఏమైనా విచారణ చేయించుతుందా లేదా ఎవరి పైన అయినా చర్యలు తీసుకుంటుందా అంటే నో అని చెప్పాలి. ఎందుకంటే అటు జగన్ అయినా ఇటు చంద్రబాబు అయినా.. కేంద్రంలో మోడీ అక్కడ ఉన్నంతవరకు ఆదానిపై ఈగ వాలని ఎవరు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.