ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ నిరుద్యోగులు గత ఆరు సంవత్సరాలుగా డీఎస్సి నోటిఫికేషన్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.. 2018 తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు ఒక్క ‘డీఎస్సి’ కూడా జరగలేదు..గత వైసీపీ ప్రభుత్వం అదిగో డీఎస్సీ ఇదిగో డీఎస్సి అంటూ కాలయాపన చేస్తూ వచ్చింది.. ఉపాధ్యాయ నిరుద్యోగులు మాత్రం ప్రభుత్వం నుంచి చిన్న స్టేట్మెంట్ వచ్చిన కూడా చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగాలు మానేసి ‘డీఎస్సి’ కోసం కోచింగ్ సెంటర్స్ కి పరుగులు పెడుతున్నారు.. రాష్ట్రంలో కొన్ని లక్షల మంది అభ్యర్థులు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నారు. నిరుద్యోగుల పుణ్యమా అని కోచింగ్ సెంటర్స్ బాగుపడుతున్నాయి.. కానీ ఏ ఒక్క నిరుద్యోగికి లాభం చేకూరట్లేదు..అసలు నిరుద్యోగులు అంటే ఈ ప్రభుత్వాలకు ఎందుకు పట్టదు.. ఎన్నికల సమయంలో భారీ హామీలు కురిపించడం గెలిచాక వాటి ఊసే ఎత్తకపోవడం ప్రతీ ప్రభుత్వానికి అలవాటైపోయింది..
గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో వున్నా ఐదేళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా అభ్యర్థులకు నరకం చూపింది.. ఇంక రెండు నెలలలో ఎలక్షన్స్ వస్తున్నాయి అనగా హడావుడిగా అతీ గతీ లేని పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది.. కానీ అది కూడా ఆగిపోయింది.మాకు ఓటయ్యండి మొదటి సంతకం డీఎస్సిపైనే అని ఊరించిన కూటమి గెలిచాక సంతకం అయితే చేసింది కానీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తుందో క్లారిటీ అయితే లేదు.. అయితే ఎప్పుడు అడిగిన ‘ త్వరలో ‘ అనే మాటనే చెబుతుంది.. త్వరలో అంటే ఏంటి..? ఎప్పుడని అనుకోవాలి..? త్వరలో అంటే రెండు నెలలా.. రెండు ఏళ్ళా.. ఏమనుకోవాలి..? అని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.. మున్ముందు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్దులే ఉండరేమో.. ఇలాంటి భాదలు పడటం ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది.. అందుకే ప్రభుత్వాలపై నమ్మకం పెట్టుకుంటే జరిగేది ఇదే.. ఏ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోదు అని నిరుద్యోగులు వాళ్ళ భాదను వెళ్ళబుచ్చుకుంటున్నారు..