ఏపీ: నటనలో చంద్రబాబు NTR నే మించిపోయారు.. జగన్ సెన్సేషనల్ కామెంట్స్..!

Divya
గత కొన్ని నెలలుగా వైసిపి, కూటమి మధ్య ఒక వార్ నడుస్తూనే ఉంది. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి సంబంధించి అన్ని విషయాలను ఎండగట్టే  ప్రయత్నం చేస్తున్నప్పటికీ అందుకు దీటుగానే కూటమి ప్రభుత్వం కౌంటర్లు వేస్తూనే ఉంది. గత ప్రభుత్వామ్యంలో రూ .10లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పు ఉందంటూ చంద్రబాబు తమ పైన విష ప్రచారం చేశారంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజున మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ సందర్భంగా చంద్రబాబు నోటి వెంట అబద్ధాలు చెప్పారంటూ జగన్ ఫైర్ అయ్యారు.

ముఖ్యంగా ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ చిత్రంలో నటనకు మించి మరీ చంద్రబాబు నటిస్తున్నారంటూ ఎద్దేవ చేయడం జరిగింది. తన పేరును చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారంటూ పైరయ్యారు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సెక్స్ హామీల పథకాలను సైతం ఎగ్గొట్టేందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారంటూ జగన్ తెలియజేశారు.. 2019లో టిడిపి ప్రభుత్వం నుంచి మరొక వైదొలిగే నాటికి సుమారుగా 3.31 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని తెలియజేశారు.
అయితే 2024 తమ ప్రభుత్వం దిగిపోయే సమయానికి కేవలం 6.64 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందంటూ తెలియజేశారు.. కానీ చంద్రబాబు మాత్రం పది లక్షల కోట్లు అప్పు ఉంది అనే దుష్ప్రచారాన్ని చేయడం ఖండిస్తున్నాం అంటూ జగన్ ఫైర్ అయ్యారు. తీరా మళ్లీ బడ్జెట్లో చూస్తే రూ .6లక్షల కోట్ల రూపాయల చూపించడం జరిగింది అంటు తెలిపారు జగన్.. ప్రస్తుతం చంద్రబాబు హయాంలో అప్పుల శాతం 19 పెరగగా తమ హయాంలో 15 మాత్రమే ఉన్నదంటూ తెలియజేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఆర్థిక శాఖ మంత్రి గ్రహించాలని తెలియజేశారు జగన్. సూపర్ సిక్స్ హామీలను అట్టకెక్కించే క్రమంలోనే చంద్రబాబు ఇలాంటివి చేస్తున్నారనే విధంగా ధ్వజమెత్తారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: