అధికారంలోకి వచ్చి రాగానే..పిఠాపురంలో మరో 12 ఎకరాలు కొన్న పవన్ కళ్యాణ్ ?
డిప్యూటీ సీఎం త్వరలోనే ఈ స్థలంలో ఇల్లు, క్యాంపు కార్యాలయాన్ని నిర్మించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని ప్రజలకు ఇక్కడ ఇల్లు కట్టుకుంటానని, ఇక్కడే ఉంటానని మాట ఇచ్చారు. అందులో భాగంగానే జూలైలో మండలంలోని భోగాపురం రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడా రెవెన్యూ పరిధిలో 2.08 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు.
ఈ నెల 4వ తేదీన పిఠాపురం పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలోనే తాను కొనుగోలు చేసిన భూమి పక్కనే మరోసారి ఈ భూమిని కొనుగోలు చేశాడు. గతంలోనూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 3.5 ఎకరాల స్థలాన్ని కొన్నాడు. ఆ భూమి పవన్ పేరు మీద రిజిస్టర్ అయింది. ఇందులో రెండు ఎకరాల స్థలంలో క్యాంపు కార్యాలయం, మిగిలిన స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని ఆయన అనుకున్నారు.
పవన్ కళ్యాణ్ భూమి కొనుగోలు చేసిన ప్రాంతంలో ఎకరం సుమారు 16 లక్షలు పైచిలుకు పలుకుతోంది. ఇప్పుడు మరో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేయడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టి పవన్ కళ్యాణ్ పై పడింది. ఎందుకు ఇలా భూమిని కొనుగోలు చేస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. అసలు అక్కడ ఏం నిర్మిస్తారు అని ప్రతి ఒక్కరిలో చర్చ నడుస్తోంది. ఆ స్థలంలో పవన్ కళ్యాణ్ ఇల్లు క్యాంపు కార్యాలయం కాకుండా మరి ఏదైనా చేయాలని అనుకుంటున్నాడా అంటూ ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు.