ఆంధ్ర‌జ్యోతి విలేఖ‌రి హ‌త్య‌కేసు.. వైసీపీ మాజీ మంత్రికి హైకోర్టు షాక్‌..?

RAMAKRISHNA S.S.
ఆంధ్రజ్యోతి విలేకరి హత్య కేసులో వైసీపీ నేతకు హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ హత్య కేసులో వైసిపి మాజీ మంత్రి.. తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ముందస్తు బయలు పిటిషన్ దాఖలు చేయగా అది ఈరోజు హైకోర్టులో విచారణకు వచ్చింది. అయితే దాడిశెట్టి రాజా ముందస్తు బయలు పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ధర్మాసనం సంచలన నిర్ణయం తీసుకుంది. 2020 ఆంధ్రజ్యోతి తుని విలేకరిగా ఉన్న కాతా సత్యనారాయణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచాలనం రేపింది. ఈ హత్యలో మాజీ ఎమ్మెల్యే అప్పట్లో మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా ప్రమేయం ఉందని పెద్ద ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కేసులు లేకుండా చేశారు పోలీసులు.

దీనిపై న్యాయవాది అయిన సత్యనారాయణ సోదరుడు మాజీ ఎమ్మెల్యే రాజా ప్రమేయం ఉందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే పై పోలీసుల కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తనకు ముందస్తు బయలు దేరాలని హైకోర్టులో రాజా పిటిషన్ వేశారు. ఈరోజు హైకోర్టు కొట్టి వేసింది తుని నియోజకవర్గ తొండంగి మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరిగా కే సత్యనారాయణ పనిచేశారు. 2020లో ఆయనను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తన విధులు ముగించుకుని రాత్రి సమయంలో ఎస్ అన్నవరంలోని తన ఇంటికి బైక్ వెళుతుండగా లక్ష్మీదేవి చెరువుగట్టు పై కొందరు వ్యక్తులు అడ్డగించి దాడి చేశారు. తమతో తెచ్చిన కత్తెలతో సత్యనారాయణను విచక్షణంగా పొడవడంతో తీవ్రంగా గాయపడి ఆయన అక్కడక్కడే మృతి చెందారు.

అయితే సత్యనారాయణ హత్యకు వైసిపి నేత దాడిశెట్టి రాజా కారణమని కుటుంబీకులు ఆరోపించారు. దీంతో దాడిశెట్టి రాజా తో పాటు ఆరుగురు పై పోలీసు కేసు నమోదు చేశారు. అయితే వైసీపీలో దాడిశెట్టి రాజా మంత్రి అవడంతో కేసు ముందుకు సాగలేదు. అలాగే 2023లో దాఖలైన చార్జిషీట్లోను దాడిశెట్టి రాజా పేరు తప్పించేశారు. అయితే మృతుడు సత్యానారయణ సోదరుడు, న్యాయవాది కాతా గోపాలకృష్ణ ... తమకు న్యాయం చేయాలని.. దాడిశెట్టి రాజాపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి పోరాటం చేస్తున్నారురు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేయగా.. ముందస్తు బెయిల్‌ కోసం రాజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయ‌గా... బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: