అగ్రరాజ్య ఎన్నికలు: గెలిచేదేవరైనా భారత్ ఆలోచన మాత్రం అదేనా.?

FARMANULLA SHAIK
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ఈరోజు ఓటింగ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం(నవంబర్ 5) సాయంత్రం 4 గంటల నుంచి అమెరికాలో పోలింగ్ ప్రారంభం కానుంది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ నెలకొంది. ట్రంప్ గెలిస్తే రెండోసారి అధ్యక్షులు కావాలని ఉవ్విళ్లురుతున్నారు. అదే స‌మ‌యంలో క‌మ‌లా హారిస్ గెల‌ిస్తే తొలిసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు.అమెరికాలో కోట్లాది మంది ప్రజలు ఓటు వేసి తమ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ లేదా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ వచ్చే నాలుగు సంవత్సరాలు అమెరికాలో ఎవరు అధికారంలో ఉంటారు. అమెరికా చరిత్ర సృష్టిస్తుందా, తొలిసారిగా ఓ మహిళ అమెరికా అధ్యక్షురాలవుతుందా లేక డొనాల్డ్ ట్రంప్ అతిపెద్ద పునరాగమనం చేసి 4 ఏళ్ల తర్వాత మరోసారి అమెరికా అధ్యక్షుడవుతాడా అనేది ఈరోజు ఖరారు కానుంది.''అయితే, ప్రధాని మోదీతో డోనల్డ్ ట్రంప్‌కు ఉన్న సంబంధాలకు కూడా ప్రాముఖ్యత ఉంది.

ట్రంప్ హయాంలో టెక్సస్‌లో జరిగిన 'హౌడీ మోదీ' సభ ప్రజలకు ఇప్పటికీ గుర్తుంది.అమెరికాలో భారతీయ సంతతికి చెందిన రెండు ప్రధాన గ్రూపుల వారున్నారు.ఈ నేపథ్యంలో యూఎస్‌ ఎన్నికలు మన భారత్‌ పై ఎలాంటి ప్రభావం చూపుతాయని దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అంతర్జాతీయ సంస్థల నిర్వహణకు అమెరికా ఇప్పటికీ అతిపెద్ద దాతగా ఉంది.అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నా భారత్, అమెరికాల మధ్య సంబంధాలు స్థిరంగానే ఉంటాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ ఇద్దరిలో ఎవరు గెలిస్తే భారత్‌కు ప్రయోజనం కలుగుతోందనే చర్చ నడుస్తోంది. ఎవరు గెలిచినా భారత్ ను పక్కన పెట్టడం కుదరదు. జనాభా పరంగా అమెరికాకు భారత్ అతిపెద్ద మార్కెట్. అంతేకాదు అమెరికా దేశ ఉన్నతిలో మన భారతీయలు పాత్రను కాదనలేము. అటు అధ్యక్ష్య అభ్యర్ధిగా ఉన్న కమలా హారీస్ కూడా భారత్ మూలాలున్న ఆఫ్రో అమెరికన్ కావడం ఈ ఎన్నికల్లో ప్రత్యేక అంశం అనే చెప్పాలి.మొత్తంగా ఈ రోజు జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తురానేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: