జ‌గ‌న్ ' ర‌జ‌నీ అందం ' కోసం న‌మ్మ‌క‌మైన ' మ‌ర్రి ' ని కాద‌న్నావ్‌.. ఇప్పుడు ఎవ‌రు దిక్కో చూస్తున్నావా..?

RAMAKRISHNA S.S.
పదేపదే వైసీపీ అధినేత తాను మాట తప్పను .. మడమ తిప్పను అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. జగన్ ఎన్నో సందర్భాలలో కీలక త్యాగాలు చేసిన నేతలకు పదవులు ఇస్తానని మాట తప్పిన సందర్భాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో భీమ‌వ‌రంలో పవన్ కళ్యాణ్ పై పోటీ చేయడానికి భయపడినప్పుడు గ్రంధి శ్రీనివాస్‌ను పిలిచి పవన్ పై గెలిస్తే నీకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కారు. ఇక మంగళగిరిలో మాజీ ఎమ్మెల్యే ఆర్కేను గెలిపించి లోకేష్ ను ఓడిస్తే మంత్రి పదవి ఇస్తానని ఓపెన్గా హామీ ఇచ్చి తుంగలో తొక్కేశారు. మరో దారుణం ఏంటంటే ? చిలకలూరిపేటలో ఎన్నో త్యాగాలు చేసి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేసిన మర్రి రాజశేఖర్ సీటు త్యాగం చేసినందుకుగాను ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎమ్మెల్సీను చేసి క్యాబినెట్లో తన పక్కన కూర్చోపెట్టుకుంటానని హామీ ఇచ్చారు.

ఎంత దారుణం ? అంటే ఏ రాజశేఖర్ సీటు త్యాగం చేస్తే రజనీకి ఎమ్మెల్యే సీటు వచ్చిందో ... ఆ రజ‌నీ గెలుపు కోసం ఎంతో కష్టపడిన రాజశేఖర్ కు జగన్ తీరని అన్యాయం చేశారు. రాజశేఖర్ ను మంత్రిని చేస్తానని క్యాబినెట్లో తన పక్కన కూర్చుని పెట్టుకుంటానని చిలకలూరిపేట బహిరంగ సభ సాక్షిగా హామీ ఇచ్చిన జగన్... అదే రాజశేఖర స్థానాన్ని లాక్కున్న రజనీని అందలం ఎక్కించి మంత్రిని చేసి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. కేవలం రజనీ గ్లామర్‌కు ఫిదా అయిన జగన్... ఆమె మాయలో పడిపోయి పార్టీ ఆవిర్భ‌వించిన‌ప్ప‌టి నుంచి త‌న వెంటే ఉన్న‌ రాజశేఖర్‌ను పక్కన పెట్టేసారన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి.

చివ‌ర‌కు గ‌త ఎన్నిక‌ల్లో చిల‌క‌లూరిపేట‌లో ర‌జ‌నీపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌డంతో తిరిగి మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను పోటీ చేయించాల‌ని జ‌గ‌న్ అనుకున్నారు. అయితే ఆయ‌న‌కు ఎమ్మెల్సీ వ‌చ్చి యేడాది అవ్వ‌డంతో ఆయ‌న ఎమ్మెల్సీగా ఉండేందుకే ఇష్ట‌ప‌డ్డారు. ర‌జ‌నీని గుంటూరు వెస్ట్ సీటుకు మార్చినా ఆమె ఏకంగా రాజ‌కీయాల‌కు కొత్త అయిన గ‌ల్లా మాధ‌వి చేతిలో ఏకంగా 53 వేల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు. క‌ట్ చేస్తే అప్ప‌టిక‌ప్పుడు పార్టీలోకి వ‌చ్చిన ర‌జ‌నీని జ‌గ‌న్ ఎమ్మెల్యేను చేసి అంద‌లం ఎక్కించి మంత్రిని చేస్తే ఇప్పుడు పార్టీ ఓడిపోవ‌డంతో ఆమె వైసీపీలో ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఆమె జ‌న‌సేన వైపు చూస్తున్నార‌న్న ప్ర‌చారం న‌డుస్తోంది.

ఏ రాజ‌శేఖ‌ర్ అయితే జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఉన్నారో.. మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోయినా.. చివ‌ర‌కు ఎమ్మెల్సీ కూడా నాలుగేళ్ల త‌ర్వాత ఇచ్చినా అదే రాజ‌శేఖ‌ర్ ఈ రోజుకు వైసీపీకి, జ‌గ‌న్‌కు పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నారు. అలా జ‌గ‌న్ త‌న‌ను న‌మ్మిన వాళ్ల‌ను న‌ట్టేట ముంచి.. అవ‌స‌రాల కోసం పార్టీలోకి వ‌చ్చి ప‌ద‌వుల కోసం ప్రాకులాడే వారికి పెద్ద పీఠ వేయ‌డం వ‌ల్లే పార్టీ నుంచి ఈ రోజు కీల‌క నేత‌లు అంద‌రూ త‌మ దారి తాము చూసుకుంటున్నారు. జ‌గ‌న్ ఇక‌పై అయినా న‌మ్ముకున్న వాళ్ల‌కు.. న‌మ్మినోళ్ల‌ను ముందు పెట్టుకుని రాజ‌కీయం చేస్తే త‌ప్పా పార్టీ బ‌తికి బ‌ట్ట‌క‌ట్టే ప‌రిస్థితి ఉండ‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: