TTD చైర్మన్‌ గా BR నాయుడు...సభ్యుల లిస్ట్‌ ఇదే !

Veldandi Saikiran
అందరూ ఊహించినట్లుగానే.. తిరుమల తిరుపతి దేవస్థానం... పాలకమండలిని ఏర్పాటు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే టీటీడీ చైర్మన్ గా టీవీ5 అధినేత, బీ ఆర్ నాయుడు ను నియామకం చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా రిలీజ్ అయింది. చంద్రబాబు నాయుడు కు బి.ఆర్ నాయుడు అత్యంత సన్నిహితుడు అన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు కష్ట కాలంలో ఉన్నప్పుడు కూడా... నాయుడు చాలా... సాయం చేశారు.

ఆయనకు వెన్నంటే ఉండి మరి... నడిపించారు. అయితే కష్టకాలంలో చంద్రబాబుకు అండగా ఉన్నందుకు గాను... బీ ఆర్ నాయుడుకు టీటీడీ చైర్మన్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అదే సమయంలో... అన్ని సౌతిండియా రాష్ట్రాలకు న్యాయం జరిగిలే... కొంత మంది ప్రముఖులకు అవకాశం కల్పించారు నారా చంద్రబాబు నాయుడు.

టీటీడీ పాలకమండలిలో తెలంగాణ రాష్ట్రం నుంచి 5 గురికి అవకాశం దక్కింది.  అదే సమయంలో కర్ణాటక నుంచి ముగ్గురికి అవకాశం ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు. తమిళనాడు నుంచి ఇద్దరికి అవకాశం ఇచ్చారు. గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరి చొప్పున అవకాశం ఇవ్వడం జరిగింది. టీటీడీ పాలక మండలిలో ఈసారి  సగం మంది పొరుగు రాష్ట్రాల వారికి అవకాశం ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు.
తిరుమలలో గత పాలకమండలిలో సభ్యులుగా వున్న కృష్ణమూర్తి, సౌరభ్ బోర్లకు మరోసారి అవకాశం కల్పించడం జరిగింది. గతంలో పాలకమండలి సభ్యులుగా వున్న ప్రశాంతి రెడ్డి, జంగా కృష్ణమూర్తి, సుచిత్రా ఎల్లాకు మరోసారి చాన్స్ ఇచ్చారు.  టిటిడి పాలక మండలి సభ్యుడిగా రికార్డు సృష్టించారు కృష్ణమూర్తి వైద్యనాధన్. వరుసగా ఆరోవసారి టిటిడి పాలకమండలి సభ్యుడిగా కృష్ణమూర్తికి అవకాశం దక్కింది.  ఇలా అవకాశం దక్కడం చాలా గ్రేట్‌ అని చెప్పవచ్చు. ఇక ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా రిలీజ్‌ చేశారు. మరి దీనిపై వైసీపీ పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్‌ వస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

ttd

సంబంధిత వార్తలు: