జ‌గ‌న్‌ను ష‌ర్మిల డిమాండ్ చేసిన డ‌బ్బు... ఎన్ని కోట్లంటే...?

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైయస్ జగన్ రెడ్డి, జగన్ సోదరి షర్మిల రెడ్డి మధ్య ఆస్తుల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆస్తులు వివాదం నేపథ్యంలో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. నలుగురు పిల్లలకు ఆస్తులను సమానంగా పెంచాలని వైఎస్ఆర్ బతికి ఉన్న రోజుల్లోనే చెప్పారని.. అందుకే తన వాటా తనకు ఇవ్వాలని షర్మిల పంతం వేసిన సంగతి తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయమ్మ, షర్మిల పేర్లతో ఎంఓయు రాయించారు.

నాలుగేళ్ళ‌ క్రితం ఆస్తులు వ్యవహారంపై ఏం జరిగిందో.. వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ అయితే బయటకు వచ్చింది. అయితే ఎలాంటి ఎంవోలు రాయించాల్సిన అవసరం లేదని.. రాయించిన వాటిని కూడా చించేస్తానని.. తన వాటాగా తనకు రావలసిన నగదు ఇవ్వాలన్న డిమాండ్ ను జగన్ ఎదుట షర్మిల ఉంచారట. తనకు రావాల్సిన వాటా కింద మొత్తం రూ.2000 కోట్లు ఇవ్వాలని జగన్‌ను షర్మిల డిమాండ్ చేశారని.. ఇందుకు జగన్ ఒప్పుకోకపోవడంతో షర్మిలకు కోపం వచ్చిందని వైసీపీ వర్గాల ప్రచారం జరుగుతోంది. ఆస్తులు అటాచ్మెంట్ పేరుతో తనను అన్న మోసం చేస్తున్నారనేది షర్మిల ఆరోపణ.

అయితే షర్మిల డిమాండ్ చేస్తున్నట్టుగా రూ.2000 కోట్లు ఇవ్వాలని వైఎస్ విజయమ్మ కూడా చెబుతున్నారట. దీంతో తల్లి, చెల్లి ఒకవైపు.. జగన్ మరోవైపు అన్నట్టుగా ఈ వ్యవహారం నడుస్తోంది. ఆస్తుల వివాదం కాస్త చివరికి రాజకీయంగా కూడా అన్నా, చెల్లెలు ఇద్దరినీ చిల్చింది. తాను కోరుకున్నట్టు జగన్ ఇవ్వకపోవడంతో షర్మిల పంతానికి పోయారు. వైసీపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా.. అన్న మీదే రాజకీయ యుద్ధం చేస్తున్నారు. చివరకు ఆస్తులు వ్యవహారం కాస్త వైఎస్ఆర్ కుటుంబాన్ని బజార్లో పడేసింది. రూ.2000 కోట్లు ఇచ్చి ఉంటే అసలు షర్మిల రాజకీయాల్లో కొనసాగడం.. అలాగే అన్నకు వ్యతిరేకంగా రాజకీయాలు చేయటం అన్న పరిస్థితి ఉండేదే కాదని వైసీపీ వాళ్ళే చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: