నెంబర్ 5కు షర్మిల మెనార్కిజంకు ఉన్న లింక్ ఇదే..!
కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్ష పదవి అంటే.. ఒకరకంగా సీఎం తర్వాత సీఎం పోస్టు వంటిది! కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కనుక.. రాష్ట్రాల్లో ఉన్న పీసీసీ చీఫ్‌ల హవా సీఎంను మించి ఉంటుంది. అలాంటి కీలక పదవి పీసీసీ చీఫ్. దీనిని తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. పైగా.. ఈ సీటులో ఉన్న వారికి అనేక వెలుసుబాట్లు కూడా ఉన్నాయి. ఉంటాయి. కానీ, ఇవేవీ షర్మిల వినియోగించుకో కుండా.. కేవలం ఆస్తులు.. వ్యవహారాలతోనే తలమునకలయ్యారు.
సాధారణంగా.. వ్యక్తిగా ఎవరైనా పుంజుకుంటే.. వ్యవస్థ సదరు వ్యక్తి చుట్టూనే తిరుగుతుంది. జగన్ విష యంలో అదే జరిగింది. చంద్రబాబు విషయంలోనూ ఇదే జరిగింది. వీరిద్దరూ కూడా.. ఎవరి స్థాయిలో వారు ప్రజలకు చేరువై.. వ్యక్తులుగా పుంజుకున్నారు. విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు పుంజుకుం టే, వైఎస్ వారసుడిగా జగన్ ప్రజల్లోకి వెళ్లిపోయారు. ఫలితంగానే ఇద్దరి చుట్టూ.. రాజకీయాలు తిరుగుతున్నాయి. వ్యవస్థ తిరుగుతోంది.
ఈ పరిస్థితికి షర్మిల చేరుకుంటే తప్ప.. ఆమె రాజకీయాల్లో ఒక కీలక నాయకురాలిగా గుర్తించే పరిస్థితి ఉండదు. కనీసం.. 5 శాతం ఆమె కష్టపడితే.. లోకల్ పాలిటిక్స్ ఏం ఖర్మ.. జాతీయ స్థాయిలోనే ఆమెకు గుర్తింపు తథ్యం. రాష్ట్రంలో 1 శాతం ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకును 5 శాతానికి తీసుకువెళ్లి.. ప్రజలను తిరిగి కాంగ్రెస్ వైపు తిప్పుకోగలిగితే.. షర్మిల చుట్టూ ఇతర పార్టీలు, నాయకులు, రాజకీయాలు తిరుగుతా యి. ఇలా చేయనంత వరకు.. ఆమె రాజకీయాలు.. గాంధీ భవన్ చుట్టూనే తిరుగుతాయనడంలో సందేహం లేదు.