కేసీఆర్ టచ్ లోకి 5 గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..ఫార్మ్ హౌస్ లో చర్చలు ?
అయితే ఈ డ్రగ్స్ టెస్టుల వ్యవహారం కొనసాగుతున్న తరుణంలో... గులాబీ పార్టీ కెసిఆర్ గురించి సంచలన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఓ నేషనల్ పత్రికలో కేసీఆర్ పార్టీ గురించి ప్రత్యేక కథనం కూడా వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఐదుగురు... కెసిఆర్ టచ్ లోకి వెళ్లారట. కాంగ్రెస్ పార్టీలో ఉండబోమని... గులాబీ పార్టీలో చేరతామని... కెసిఆర్ దగ్గరికి వచ్చారట ఆ ఎమ్మెల్యేలు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు ఇస్తున్నాయని ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు గ్రహించారట. మళ్లీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే ప్రసక్తే లేదని సర్వేలు కూడా చెబుతున్నాయని.. ఆ ఎమ్మెల్యేలు గ్రహించినట్లు సమాచారం. దీంతో చేసేది ఏమీ లేక కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లి ఆయనను కలిశారట ఐదుగురు ఎమ్మెల్యేలు.
ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలిసిన తర్వాత... గులాబీ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారట. మాకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వద్దని తేల్చి చెప్పారట. ప్రజల కోసం పోరాటం చేస్తామని.. ఎన్నికలలో తమ పార్టీ నుంచి గెలిచిన వారు మాత్రమే తమ నేతలని స్పష్టం చేశారట. కానీ ఇతర పార్టీ నుంచి గెలిచినవారు తమకు వద్దని తేల్చి చెప్పారట కల్వకుంట్ల చంద్రశేఖర రావు. దీంతో ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు ఎవరు అనే దానిపైన కొత్త చర్చ జరుగుతుంది.