ఏపీ: అధినేతలు మాత్రమే దోస్తీ.. నేతలు కాదు.. కూటమిలో కుమ్ములాటలు..!
కూటమిలో కీలకమైన పార్టీలుగా ఉన్న టిడిపి ,జనసేన అధినేతలు దోస్తీలు చేసినప్పటికీ లీడర్లుగా ఉన్న కొంతమంది నేతలు మాత్రం ప్రతి చిన్న దానికి గొడవ పడుతూ రోడ్డుకి ఎక్కుతున్నారు. అలా ఒక విషయాన్ని మర్చిపోకముందే మరొక నియోజకవర్గంలో ఏదో ఒకచోట గొడవలు కనిపిస్తూనే ఉన్నాయట. ఇప్పుడు తాజాగా కాకినాడ పంచాయతీ తెరమీదకి రావడం జరిగింది అక్కడ ఒక వైన్ షాప్ కోసం మొదలైన వివాదం టిడిపి నేత మల్లిపూడి, ఎంపీ అనుచరుడు దొరబాబు ఉండి అక్కడ అవా చూపిస్తున్నారట. అయితే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ,ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్న వీరి అనుచరులు మాత్రం రచ్చ చేస్తున్నారట.
ఇప్పుడు ఈ వివాదం మరువకముందే మరొక వివాదం తెరమీదకి తీసుకువచ్చారు. దీనివల్ల నిరసన చేసే స్థాయికి కూడా దిగిపోయిందట. దీపావళి బాణ సంచాల విషయంలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అనుచరుల మధ్య వివాదాలు మొదలయ్యాయి. టిడిపి నేత అయిన మల్లెపూడి వీరు ఆర్టీవో ఆఫీస్ ఎదురుగా దాదాపుగా 5 గంటల పాటు ఒక అలజడి సైతం సృష్టించారట. అలా కాకినాడ ఎంపీ ఎమ్మెల్యేల అనుచరుల మధ్య వివాదం కూటమినేతలకు తలనొప్పిగా మారిందట. అయితే ఈ విషయాలన్నీ కూడా అక్కడ ఎంపీ ,ఎమ్మెల్యేలకు తెలిసే జరుగుతున్నాయని చర్చ కూడా వినిపిస్తోంది. ఈ స్థాయిలోనే అటు పిఠాపురం లో కూడా మాజీ ఎమ్మెల్యే వర్సెస్ Svss వర్గాల మధ్య కూడా నడుస్తున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ధర్మవరం మున్సిపల్ చైర్మన్ విషయం పైన కూడా ఇదే రచ్చ జరిగింది. మొత్తానికి అధినేతలు సఖ్యతగా ఉన్న లీడర్లు మాత్రం గొడవలు చేస్తూ ఉన్నారు.