దీపావళి కోసం మార్కెట్లో కొత్త సరుకు దిగింది... జరా పిల్లలు జాగ్రత్త!
దీపావళి పండుగ జరుపుకునేందుకు మధ్యలో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. దాంతో ప్రతి చోట దివాళి క్రాకర్స్ బండెలు కొలదీ కొలువు తీరాయి. ఈ సంవత్సరం మరి ముఖ్యంగా, చిన్నపిల్లల కోసం రకరకాల టపాకాయలు మార్కెట్లోకి తీసుకువచ్చారు. అవి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉండడంతో పిల్లలు వాటిని కొనమని తల్లిదండ్రులను విసిగించే పరిస్థితి ఉంది. అయితే పండగ సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది కదా అని, తల్లిదండ్రులు వాటిని కొనేముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం ఇక్కడ చాలా అవసరం. లేదంటే గతంలో కొన్ని చోట్ల జరిగినట్లు పెను ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఎంతైనా ఉంది.
గతంలో సీమ టపాకాయలు పేలుస్తున్న కారణంగా చాలామంది చిన్నపిల్లలు తన కంటి చూపుని కోల్పోవడం గురించి మనం చాలాసార్లు విన్నాం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు కోరి కొని తెచ్చుకోకుండా తల్లిదండ్రుల జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. దానికి మొదటగా, ఫేస్ షీల్డ్ ఫైబర్ గ్లాస్ ఐటమ్ ఒకదానిని కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే, అది అంగరక్షకుని వలె మీ పిల్లల నేత్రాలను కాపాడగలరు. ఫేస్ షీల్డ్ గురించి మీరు వినే ఉంటారు. సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం కరోనా సమయంలో మనం అటువంటి పరికరాలను వాడే ఉన్నాము.
అదే రకంగా ఫైబర్ గ్లాసెస్ వాడడం వలన కూడా మంచి ఫలితాలు ఉండును. ఇవే సాధారణంగా బయట మార్కెట్లో మనకు అందరికీ దొరికావే. అలా దొరకని ఎడల ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే 24 అవర్స్ లో మీ ఇంటి వద్దకే వచ్చి చేరుతాయి. ఇలాంటి పనిముట్లు లేకుండా మీ పిల్లలను టపాకాయలు పేల్చేందుకు అస్సలు అనుమతిని ఇవ్వకండి. లేదంటే చాలా ప్రమాదాలు చవిచూడాల్సి వస్తుంది. మరోపక్క తెలుగు రాష్ట్రాలలో కొన్నిచోట్ల ఇప్పటికే దీపావళి క్రాకర్స్ విషయంలో పలు ప్రమాదాలు సంభవించినట్లు వచ్చిన వార్తలను మనం వింటూనే ఉన్నాం. నిన్నటికి నిన్న తెలంగాణలో ఒక క్రాకర్స్ షాపు మొత్తం దగ్ధమైన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాబట్టి ఈ దీపావళి అమావాస్యను అందరూ అద్భుతంగా మార్చుకోండి.