బాలయ్య డెసిషన్... బాబుకు ఎఫెక్ట్ తప్పదా..!
అదే.. టీడీపీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం. ప్రస్తుతం మీడియా వర్గాల్లో జరుగుతున్న చర్చలను బట్టి.. నందమూరి బాలయ్య.. హైదరాబాద్ శివారులో సుమారు 150 ఎకరాల్లో అధునాతన వసతులతో సినీ స్టూడియోను నిర్మించనున్నారని తెలుస్తోంది. దీనికి సంబం ధించి భూమి కేటాయింపు.. అనుమతులు వంటి వాటి కోసం తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకు న్నారని.. నేడో రేపో దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నదని తెలుస్తోంది.
ఇది తప్పుకాదు. ఎవరి వ్యాపారం వారు చేసుకోవడం మంచిదే. దీనివల్ల పది మందికి ఉపాధి కూడా లభి స్తుంది. సో.. బాలయ్య వంటి అగ్రనటుడు ఒక స్టూడియో కట్టుకుంటే.. ఎవరూ తప్పుపట్టరు. ఇండస్ట్రీ కూడా హర్షిస్తుంది. అయితే.. ఇక్కడ సమస్య ఏంటంటే.. ఏపీలో పెట్టుబడుల కోసం అన్వేషిస్తున్న ప్రభు త్వం.. బాలయ్యను ఎందుకు వదులుకుంది? అనేది ప్రశ్న. ఎందుకంటే.. విశాఖను ఐటీ రాజధానిగానే కాకుండా.. సినిమా ఇండస్ట్రీకి కూడా క్యాపిటల్ చేయాలని గత వైసీపీ, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వాలు తలపోశాయి.
ఈ నేపథ్యంలో అధికార పార్టీకే చెందిన ఎమ్మెల్యే, పైగా ముఖ్యమంత్రి వియ్యంకుడు బాలయ్య.. ఏపీని వదిలేసి తెలంగాణలో స్టూడియో నిర్మాణానికి ఆలోచన చేయడం.. దీనికి అక్కడ ఏర్పాట్లు కూడా జరుగు తుండడం వంటివి చంద్రబాబును ఇరుకున పెట్టే అవకాశం ఉంది. ఆ ప్రోత్సాహాలు.. ఆ నిర్మాణాలు ఏపీ లోనే చేసుకోవచ్చు కదా! పైగా సొంత ప్రభుత్వం.. అంతకు మించి సొంత పార్టీ ఎమ్మెల్యే... బాలయ్యే రంగంలోకి దిగితే.. మరింత మంది వచ్చేందుకు అవకాశం ఉంటుందన్న విశ్లేషణలు వస్తున్నాయి.
రేపు వేరేవారు వచ్చేందుకు బాలయ్య ఆదర్శంగా కూడా నిలుస్తారని చెబుతున్నారు. కానీ, ఇప్పుడు బాలయ్య చూపు తెలంగాణపై నే ఉండడం.. రాజకీయంగా రేపు విమర్శలు వచ్చేఅవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.