ఏపీ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఏకంగా 7,545 పోస్టుల భర్తీ..!
మొత్తం మీద 18 విభాగాలలో ఏపీఎస్ఆర్టీసీలో 7,545 ఖాళీలను సైతం భర్తీ చేసేందుకు సిద్ధమయ్యింది. ఇందులో సుమారుగా 3,673 రెగ్యులర్ డ్రైవర్లను భర్తీ చేయబోతున్నట. అలాగే 1,813 కండక్టర్ పోస్టులను 579 అసిస్టెంట్ మెకానిక్, 656 జూనియర్ అసిస్టెంట్, 208 డిప్యూటీ సూపర్డెంట్, 179 మెకానిక్ సూపర్వైజర్, 2007 ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నట్లు ఆర్టిసి యాజమాన్యం ఇటీవలే తెలియజేసింది. ఇందుకు సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్లు తెలిపారు.
ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్ గా పనిచేసేందుకు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని.. అన్ని జిల్లాల వారీగా వివరాలను ఇప్పటికీ ప్రకటించామంటూ తెలిపారు.. డీజిల్ మెకానిక్, వెల్డర్, పెయింటర్, మోటార్ మెకానిక్ ఇతర ట్రేడ్లలో జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులను తెలియజేశారు ఇందుకోసం ఐటిఐ పూర్తి చేసిన వారందరూ కూడా అర్హులే అన్నట్లుగా తెలిపారు. అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎవరైనా అభ్యర్థులు ఎంపిక అయితే తీసుకుంటారని తెలిపారు. అయితే ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్, ఏజ్ ఇతరత్రా వాటిని త్వరలోనే అధికారికంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించబోతోంది. మరి ఏ మేరకు నిరుద్యోగులకు ఇది వరంగా మారనందో చూడాలి.