కాపు సంక్షేమం కోసం బాబు ఆరాటం... చేయబోతోంది అదే!
ఇక అన్నిటికంటే చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే... 2024 ఎన్నికల్లో జనసేన కూడా టీడీపీ కూటమి పొత్తులో ఉండడం టీడీపీకి అనుకూలించింది అని చెప్పుకోవచ్చు. అందుకే గోదావరి జిల్లాలలో ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కకుండా కూటమి అభ్యర్ధులే గెలుచుకున్నారు. కట్ చేస్తే, టీడీపీ కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అందులో కాపులదే ప్రధాన వాటా అని చెప్పాల్సిన పనిలేదు. దాంతో వారంతా కూటమి ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. తమకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని వారు కోరుకుంటున్నారు.
ఇదిలాఉండగా రానున్న అయిదేళ్ల కాలంలో కాపుల సంక్షేమం కోసం దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మొత్తం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాపు భవనాల నిర్మాణాలతో యువతకు అన్ని విధాలా అండగా నిలిచేలా కార్యచరణ సిద్ధం చేశారని మంత్రి సవిత తాజాగా మీడియాతో వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గానికి సీఎం చంద్రబాబు నాయుడు తోనే మేలు కలుగుతుందని ఆమె స్పష్టం చేశారు. గడిచిన ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి సీఎం చంద్రబాబు చిత్తశుద్దితో ఉన్నారన్నారు.