చైనాలో కొత్త ప్రయోగం సక్సెస్.. చనిపోయిన వారిని బ్రతికించొచ్చు?

praveen
నేడు ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక టెక్నాలజీ రంగంలో అమెరికా తరువాత చైనా రెండవ స్థానంలో ఉందనేది నిర్వివాదాంశం. ఎన్నో నూతన ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన చైనా మరో అరుదైన ప్రయోగం చేసి రికార్డ్ సృష్టించింది. సాధారణంగా మనిషికి చావులేకుండా చేయడం? అనేది అసాధ్యం. ఎందుకంటే పుట్టిన ప్రతీ ప్రాణి గిట్టక తప్పదు కాబట్టి. అయితే ఇపుడు మనిషి చావుని జయించే దిశగా చైనా సరికొత్త ప్రయోగాలకి శ్రీకారం చుట్టింది. అవును, చనిపోయిన మెదడును 50 నిమిషాల తర్వాత బ్రతికించిన అరుదైన ఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనా పరిశోధకులు సరికొత్త ఘనతను సాధించి ఎలుగెత్తి చాటారు.
గుండెపోటు తర్వాత రోగులకు పునరుజ్జీవనం అందించడంలో సహాయపడే ప్రయోగం ఓ అడుగు ముందుకు వేసినట్టు చైనా జనరల్స్ లో ప్రచురితం అయింది. ఇందులో భాగంగా.. ఓ ప్రయోగంలో చనిపోయిన తర్వాత పంది మెదడును తొలగించి.. సుమారు ఓ గంట తర్వాత దానిని మరలా పునఃప్రరంభించినట్లు చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. గుండెపోటు వల్ల మెదడు దెబ్బతినడాన్ని సరిచేసే ప్రక్రియలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుందని ఈ పరిశోధన ద్వారా తెలిసిందని చెప్పుకొచ్చారు. గ్యాంగ్ జౌ లోని సన్ యాట్ సేన్ యూనివర్శిటీ అనుబంధ ఆసుపత్రి పరిశోధకులు.. పంది మెదడులోని నాడీ కార్యకలాపాలను శరీరం నుంచి తొలగించిన తర్వాత పునరుద్దరించడానికి లైఫ్ సపోర్ట్ సిస్టంను ఉపయోగించారు.
ఈ ప్రయోగంలో, జర్మన్ ట్రాన్స్ ప్లాంటేషన్ సొసైటీ మాజీ ప్రెసిడెంట్ జోయెర్న్ నాషన్, క్లీవ్ ల్యాండ్ క్లీనిక్ లోని ఇమ్యునిటీ స్పెషలిస్ట్ ఆండియా వంటి అంతర్జాతీయ సహకారులు కూడా పాల్గొన్నట్టు సమాచారం. ఎన్.ఎం.పీ (లివర్ అసిస్టెడ్ బ్రెయిన్ నార్మోథర్మిక్ మెషిన్ పెర్ఫ్యూజన్) అని పిలిచే "ఎక్స్ వివో బ్రెయిన్ మెయింటినెన్స్" సాంకేతికతను ఈ బృందం అభివృద్ధి చేసింది. ఈ నేపథ్యంలో పరిశోధకులు పందులకు మత్తుమందు ఇచ్చి వాటి మెదడులను వేరు చేయడాని ఆపరేషన్ చేసారు సదరు బృందం. ఈ సమయంలో మెదడు మాత్రమే ఎన్.ఎం.పీ. కి కనెక్ట్ చేయబడింది. ఈ సమయంలో మెదడు తరంగాలు శరీరం నుంచి తొలగించబడిన 50 నిమిషాల తర్వాత.. ఆ తరంగాలు తిరిగి మెదడుకు వచ్చినట్లు వెల్లడించారు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: