షర్మిల ఆస్తులు వెనక్కు... జగన్ నిర్ణయం తప్పా.. ఒప్పా... ?
ఇక, తటస్థంగా ఉండేవారు.. ఈ విషయంపై ఎటూ తేల్చలేని పరిస్థితి ఏర్పడింది. సహజంగా.. ఆస్తుల వివాదాలు ఏ కుటుంబంలో అయినా వస్తాయి. కానీ, రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తున్న జగన్.. షర్మిలల విషయంలో వచ్చిన వివాదాలు.. అందరికీ హాట్ టాపిక్‌గా మారాయి. ప్రత్యేకించి.. జగన్‌ను వ్యతిరేకించే మీడియాకు పండగగా మారింది. చెల్లికి ద్రోహం చేశారని.. తల్లికి అన్యాయం చేశారన్న రాతలతో మీడియా విరుచుకుపడింది.
సరే.. ఈ విషయాన్ని పక్కన పెడితే.. అసలు జగన్ నిర్ణయం తప్పా.. ఒప్పా.. ? అనేది చర్చనీయాంశం. రాజకీయాలకు ప్రేమ, ఆత్మీయత అనేవి ఉండవు. అది ఎక్కడైనా..? గతంలోనే కాదు.. ప్రస్తుతం కూడా ఈ విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నవే. అవసరం-అవకాశం అనే రెండు ట్రాకులపైనే రాజకీయ రైలు బండి ప్రయాణం చేస్తుంది. ఇలా చూసుకుంటే.. షర్మిల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం రాజకీయ పరంగా ఆయన చెబుతున్నట్టే తప్పుకాదని మేధావులు చెబుతున్నారు.
దీనిని ఎవరూ కూడా కొట్టిపారేయలేని పరిస్థితి. నిన్న మొన్నటి వరకు రాజకీయంగా ఏదో రాయబేరాలు నడుపుతున్నారంటూ.. వచ్చిన వార్తల నేపథ్యంలో తాను సన్నగిల్లలేదు.. అన్న సూత్రాన్ని జగన్ చెప్పుకొ న్నారనే భావించాలి. అంటే.. తాడో పేడో తేల్చుకునేందుకే జగన్ సిద్ధమయ్యారు. ఇక, షర్మిల కోణంలో చూసినప్పుడు.. ఆమె న్యాయపరంగా పోరాడేందుకు చాలా స్కోప్ ఉంది. కానీ, ఇది రాజకీయంగానే ఆమెకు ఉపయోగపడుతుందని భావిస్తే.. ఆమె నిర్ణయం ఎలా ఉన్నా.. ప్రజలు ఏమేరకు ఆమోదిస్తారన్నది చూడాలి. సో.. మొత్తంగా జగన్ చేసింది.. తప్పా.. ఒప్పా.. అంటే.. ఎటూ తేల్చలేని పరిస్థితి ఏర్పడింది.