ఉపాధి కల్పనే లక్ష్యంగా వినూత్న కార్యక్రమంతో ఐఎస్ఎఫ్ ఫౌండర్..!

FARMANULLA SHAIK
ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ అనేది ఒక స్టార్టప్ ఎకోసిస్టమ్ యొక్క అభివృద్ధి మరియు పురోగమనాన్ని ప్రోత్సహించడానికి అంకితం చేయబడిన ఒక ప్రముఖమైన సంస్థ దింట్లో ఎస్టాబ్లిష్ చేయడంలో ఎటువంటి లాభం ఆశించకుండా కేవలం కొత్త తరం కొలువుల కోసమే పనిచేస్తున్న సంస్థ.వ్యాపార అభివృద్ధి యొక్క చిక్కులను విజయవంతంగా నావిగేట్ చేసిన అనుభవజ్ఞులైన వ్యవస్థాపకుల బృందం దీనిని ప్రారంభించింది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా స్టార్టప్‌లు విజయవంతం కావడానికి సరైన వేదికను అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని సంస్థ ఫౌండర్  JA చౌదరి గారు అన్నారు.
ఐఎస్ఎఫ్ అనేది ఇండియాలో యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి పెట్టినటువంటి ఒక లాభాపేక్ష రహిత సంస్థ. ముఖ్యంగా భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో వాణిజ్యంలో ముందుకు దూసుకుపోవాలని లక్ష్యంతో ఈ సంస్థ ప్రారంభించామని అలాగే దానికి తగిన విధంగానే స్టార్టాప్ల, మెంటార్ల మధ్య సమన్వయంతో మంచి సంబంధాలు ఏర్పరుస్తుంది. భారత్తో ప్రభుత్వం చేపట్టిన పలు కీలక కార్యక్రమాలలో స్టార్ట్ అప్ లతో సహకరించడానికి వాటి వృద్ధిని ప్రోత్సహించడానికి నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు.
ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువ మంది యువత సాఫ్ట్వేర్ అంగం వైపు పరిగెడుతున్నారు కానీ స్టార్టర్లపై ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు దానిపై అవగాహన కలిగించేందుకు ఇటీవల హైదరాబాదులో నిర్వహించినటువంటి కాన్ఫరెన్స్లో దాదాపు యాభై అయిదు వేలకు పైగా స్టార్ట్ అప్ రిజిస్ట్రేషన్  చేయించుకున్నాయి అయితే వారికి ఎలాంటి అవగాహన లేదని తెలిసిపోయింది దాంతో మెంటల్ షిప్ అనేది ముఖ్యమని తేలింది. ఎప్పుడైనా సరే స్టార్ట్ రొటీన్ ఐడియా తో వెళ్తే లాభం కొత్తగా ఇన్నోవేటివ్గా థింక్ చేయాలనీ అన్నారు.
అంకుర బస్సు యాత్ర పేరుతో ఒక వినూత్న కార్యక్రమం ప్రారంభించామని దీనివల్ల గ్రామీణ నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని ఐఎస్ఎఫ్ ఫౌండర్ చౌదరి గారు అన్నారు.ఇంజనీరింగ్ మరియు టెక్నికల్ కోర్సెస్ చేసిన వారికీ ఇదొక సువర్ణ అవకాశం లాగా భావించవచ్చని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: