చెల్లికి కృతజ్ఞత లేదంటు.. జగన్ సంచలన లేఖ..!

Divya
వైయస్సార్ కుటుంబంలో గత కొద్ది రోజులుగా విభేదాలు ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఆ విషయాలు నిన్నటి రోజున ఆస్తి పంపకాల వివాదం అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ సీఎం జగన్ తన చెల్లెలు షర్మిల మధ్య ఆస్తి పంపకాల పంచాయతీ కోర్టు వరకు చేరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీరిద్దరి మధ్య లేఖలో యుద్ధం కూడా కొనసాగుతోంది. అయితే తాజాగా షర్మిల, జగన్ మధ్య సరస్వతి పవర్  షేర్లు వివాదంలో కోర్టులో జగన్ కేసు దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వివాదం పైన జగన్ కు షర్మిల రాసిన లేఖను సైతం టిడిపి తన ట్విట్టర్ నుంచి బయటపెట్టింది.

ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ఆస్తి రాజకీయ విభేదాలకు తెర లేపాయి అన్నట్లుగా ఈ లేఖలు తెలియజేశారు. అలాగే జగన్ తన సోదరి షర్మిలకు రాసిన లేఖలో పలు విషయాలను తెలిపారు. తనను రాజకీయంగా వ్యతిరేకించడంతోపాటు వ్యక్తిగత ప్రతిష్టను సైతం దెబ్బతీసేలా చేసిందంటూ తెలిపారు. అసత్యాలు చేసావని .. తన చర్యల వల్ల చాలా బాధపడ్డాను అంటూ జగన్ తన లేఖలో వివరించుకున్నారు. ఈ కారణంగానే సరస్వతి పవర్ కంపెనీలు గిఫ్ట్ కింద ఇచ్చిన వాటిని వెనక్కి తీసుకున్నట్లుగా లేఖలో జగన్ క్లారిటీగా చెప్పారు.

నాన్న సంపాదించిన ఆస్తులను వారసత్వంగా ఆయన బతికి ఉన్న సమయంలో ఇద్దరికీ సమానంగానే ఇచ్చారని జగన్ లేఖలో గుర్తు చేశారు. ఆ తర్వాత తన సొంత శ్రమ పెట్టుబడితో పలు రకాల వ్యాపారాలను చేశాను వాటికి వారసత్వంతో ఏం సంబంధం లేదని.. ఎంతో ప్రేమ ఆప్యాయతతో కొన్ని ఆస్తులను కూడా తన చెల్లి షర్మిల పేరిట బదిలీ చేశానని వివరించారు.. ఇక అమ్మ పేరిట కూడా చాలా షేర్లు కూడా రాసిచ్చానంటూ తెలియజేశారు. న్యాయపరమైన చిక్కులు తొలిగాక రాబోయే రోజుల్లో మరికొన్ని ఆస్తులను కూడా తన చెల్లి పేరు మీద బదిలీ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలియజేశారు.

అంతేకాకుండా అమ్మ ద్వారా కూడా తన చెల్లికి 200 కోట్లు ఇచ్చానని షర్మిలకు రాసిన లేఖలో జగన్ తెలియజేశారు అయితే ఇదంతా కూడా తాను ప్రేమతోనే చేశానని తెలిపారు జగన్. కానీ షర్మిలాకు ఎలాంటి కృతజ్ఞత లేకుండా తనతో వ్యవహరిస్తుందంటూ తెలిపారు. తనకు వ్యతిరేకంగా చాలా చర్యలకు పాల్పడింది షర్మిల అంటూ తెలిపారు. అందుకే తనమీద ప్రేమ ఆప్యాయత చూపించాల్సిన అవసరం లేదని తెలిపారు జగన్.. షర్మిల ప్రవర్తనలో ఆలోచనలో మార్పు వస్తే కోర్టు సమస్యలు పరిష్కారం అయ్యాక మరిన్ని ఆస్తులను ఇవ్వాలా వద్ద అనే విషయం పైన తిరిగి పరిశీలిస్తానంటూ జగన్ లేక ద్వారా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: