ముందస్తు జమిలీ... వైసీపీ ఆశలు చూశారా...!
ఈ నేపథ్యంలో వైసిపి సరికొత్త ఆశలతో కనిపిస్తోంది. వైసీపీ అధినేత పార్టీ నేతలను సరికొత్త నినాదంతో ఉత్సాహపరుస్తున్నారట. ముందస్తు జెమిలీ జపం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. జెమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది. కానీ.. ముందస్తు అని చెప్పిందా.. కనీసం ఆ సంకేతాలు పంపిందా.. అంటే లేదనే చెప్పుకోవాలి. జెమిలీకి లోక్ సభ ఎన్నికలు జరిగే సమయంలో.. కరెక్ట్‌గా లోక్‌సభతో పాటు.. నాలుగు రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతాయి.
నాలుగు నెలల ముందు ఐదు రాష్ట్రాలు.. ఆ తర్వాత నాలుగు నెలల వ్యవధిలో మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. అంటే ఇక్కడే సగం రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి . ఇక మిగిలిన రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని ముందుకి వెనక్కి జరపటం కష్టమా.. లోక్‌సభ పదవీకాలం తగ్గించడం సులువు అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. ఇది ఎలా ఉన్న వైసీపీ వాళ్ళు మాత్రం పార్టీలో కొత్త ఉత్సాహం నింపేందుకు జమిలీ పేరుతో హడావుడి చేస్తున్నారు జగన్. తన పార్టీ నేతలను వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చేస్తుంది . కూటమి ప్రభుత్వంపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. మీరు రెడీగా ఉండండి అంటూ ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారట.