ఎల్లో మీడియాపై స‌ర్కార్ యాంటీ వార్త‌లు... మీడియాధిప‌తుల‌కు ముడుపులు ఇవ్వ‌ట్లేదా...?

RAMAKRISHNA S.S.
గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు గ‌త మూడు మాసాల నుంచి కూడా.. టీడీపీని స‌మ‌ర్ధించే మీ డియాలో వ్య‌తిరేక క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఏదో ఒక‌రోజు రాశారంటే అర్థం ఉంటుంది. కానీ, రోజూ ఏదో ఒక అంశంపై చంద్ర‌బాబుకు అనుకూలంగా వ్య‌వ‌హరించే మీడియా స‌ర్కారును ఇర‌కాటంలోకి నెడుతోంది. మ‌రి దీనికి కార‌ణం ఉందా?  ఉంటే అదేంటి? అనేది ఇప్పుడు ఇత‌ర  మీడియా చానెళ్ల‌లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. వాస్త‌వానికి చంద్ర‌బాబు హ‌యాంలో అనుకూల మీడియా అద్భుతాల‌నే రాస్తుంది.

ఇది ప‌క్కా..! ఇందులో తిరుగులేదు. కానీ, ఇప్పుడు మాత్రం ఎక్క‌డో తేడా కొడుతోంది. దీంతో వ్య‌తిరేక‌తను వండివారుస్తున్నారు. ఇటీవ‌ల ఒకానొక సంద‌ర్భంలో చంద్ర‌బాబు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే స్థాయిలో మీడియా వార్త‌లు ఉండ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ అనుకూల మీడియాలో ఎలానూ వ్య‌తిరేక వార్త‌లు వ‌స్తాయి. దీనిని చంద్ర‌బాబు కానీ, కూట‌మి నేత‌లు కానీ.. పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకోరు. కానీ అనుకూలంగా ఉంటాయ‌ని.. ఉండే.. మీడియా హౌసుల్లోనే ఇలా యాంటీ వార్త‌లు రావ‌డంతో స‌ర్కారు ఉలిక్కి ప‌డుతున్న మాట వాస్త‌వం.

మొత్తంగా ఈ వ్య‌వ‌హారం కూట‌మి నాయ‌కుల్లో చ‌ర్చ‌గా మారింది. ఈ విష‌యంలో ఒకింత తెర దీసి చూస్తే.. మీడియా అధిప‌తులుగా ఉన్న‌వారిని.. స‌రైన విధంగా సంతృప్తి ప‌ర‌చ‌లేక పోతున్నార‌న్న వాద‌న వినిపి స్తోంది. ప్ర‌భుత్వ ప‌రంగా ప్ర‌క‌ట‌న‌లు కానీ, వ్య‌క్తిగ‌తంగా ఇచ్చే ముడుపులు కానీ.. అంద‌డం లేద‌న్న‌ది నిష్టుర స‌త్య‌మ‌ని టీవీ చ‌ర్చ‌ల్లో పాల్గొంటున్న‌వారు చెబుతున్నారు. వారికి వారు వాటాలు వేసుకుంటున్నా రు... మ‌మ్మ‌ల్ని ఎప్పుడు ప‌ట్టించుకుంటార‌నేది మీడియా పెద్ద‌ల మాటగా ఉంద‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా కూడా మీడియా మేనేజ్ మెంట్ అనేది స‌ర్కారుకు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఇదే విష‌యాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా.. సెప్టెంబ‌రులో చెప్పేశారు. ఎవ‌రు అనుకూల‌మో.. ఎవ‌రు ప్ర‌తికూల‌మో గుర్తించ‌డం క‌ష్టంగా ఉంద‌న్నారు. ఇప్పుడు ఏపీలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ రోజు పొగిడిన ప‌త్రిక‌, మీడియా. రేపు ఇలానే ఉంటాయ‌న్నది లేదు. వారి చేతికి త‌డి అంట‌క‌పోతే.. రేపు ఎలాగైనా క‌లం మారిపోతోంది. ఈ నేప‌థ్యంలో కూట‌మి స‌ర్కారు త‌ల‌ప ట్టుకుంది. ఏదో ఒక చేయాల‌ని నిర్ణ‌యించార‌ట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: