కుప్పంలో పరువు పాయె.. చంద్రబాబు పేరు తొలగింపు?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. నిజంగా చెప్పాలంటే ఆయనకు అవమానం జరిగిందని చెప్పాలి. తన సొంత నియోజకవర్గమైన కుప్పం ప్రాంతంలో నారా చంద్రబాబు నాయుడుకు... ఘోర అవమానం జరిగినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కుప్పం నియోజకవర్గ స్థానిక అధికారుల తప్పిదమో? లేక అవగాహన లోపం తెలియదు కానీ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాత్రం ఘోర అవమానం ఎదురైందని చెప్పవచ్చు.

కుప్పం నియోజకవర్గంలో తాజాగా... యూనివర్సిటీ ఆహ్వాన పత్రిక రిలీజ్ అయింది. అయితే ఇందులో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరే లేదు. ముఖ్యమంత్రి అన్న ప్రోటోకాల్ మర్చిపోయిన అధికారులు... సీఎం చంద్రబాబు నాయుడు పేరును ఎత్తేశారు. కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడ యూనివర్సిటీ... 27వ వార్షికోత్సవం జరగనుంది.

ఈ తరుణంలోనే ఆహ్వాన పత్రికను ముద్రించారు. అయితే ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు లేకుండా మిగతా అందరి పేర్లు... ముద్రించారు అధికారులు. కుప్పం ఎమ్మెల్యేగా... అదే సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు పేరును... కాలేజీ యాజమాన్యం, ఇటు అధికారులు... మర్చిపోవడం విడ్డూరంగా ఉంది. ఎవరైనా కావాలనే చంద్రబాబు నాయుడు పేరు లేకుండా చేశారని కూడా.... కొత్త చర్చ జరుగుతోంది.

అయితే దీన్ని వైసిపి పార్టీ సోషల్ మీడియాలో విపరీతంగా వాడుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుని ఎలా మర్చిపోతారు.... ఆయన కంప్యూటర్ టెక్నాలజీ తీసుకువచ్చాడు గా...? అంటూ సెటైర్లు పెంచుతున్నారు. హైదరాబాద్ కనిపెట్టిన ఏపీ సీఎం  నారా చంద్రబాబు నాయుడు పేరు ఎలా మర్చిపోతారని మరికొంతమంది పోస్టులు పెడుతున్నారు. మరి కుప్పం నియోజక వర్గంలో సీఎం చంద్రబాబు నాయుడుకు ఇంతటి అవమానం జరిగితే.. టీడీపీ పార్టీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. అసలు స్పందిస్తారో.. లేక.. పట్టన్నట్టు ఉంటారో కూడా చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: