జమిలి ఎన్నికలు: చంద్రబాబు ముందున్న సవాళ్లు ఇవే.. దాటగలరా..?

Divya
త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.దీంతో అటు ఏపీలో కూడా వీటికి కూటమి ప్రభుత్వం సిద్ధంగానే ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు కూడా మరొకసారి పరోక్షంగానే తాను కూడా ఎన్నికలకు సిద్ధమని తెలియజేశారు. ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ తన మంత్రులకు ఎమ్మెల్యేలకు సైతం తెలియజేశారట. కూటమి ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను కూడా ప్రజలలోకి తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు నేతలను ఆదేశించారట.

అయితే ఇలాంటి సమయంలోనే చంద్రబాబుకు సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలను సైతం ప్రస్తుతం నెరవేర్చాల్సి ఉన్నది. అన్నిటికంటే ముందు సూపర్ సిక్స్ హామీలతో పాటుగా.. ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు చేయవలసిన హామీలు చాలానే ఉన్నాయి. అలాగే రాజధాని విషయంలో కూడా చంద్రబాబు నిరూపించుకోవాల్సిన పని ఉన్నది.అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా చేయాల్సి ఉన్నది. జమిలి ఎన్నికల ఎఫెక్ట్ వల్ల  మహా అయితే మరో రెండేళ్లు మాత్రమే చంద్రబాబు అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలోనే తాను ఇచ్చిన హామీలను సైతం పరిపూర్ణంగా పూర్తిగా అమలు చేయకపోయినా ఎంతో కొంత అయినా చేయాల్సిన అవసరం ఉన్నది.

ఇవి అమలు చేస్తేనే ప్రజలు సంతృప్తిగా ఉంటారు. లేకపోతే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే టిడిపి నేతలు దూకుడు కూడా తగ్గించుకునేలా చేయాలి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో కూడా నియోజకవర్గాలలో చాలా తప్పులు జరుగుతున్నాయి.. ముఖ్యంగా మహిళల పైన జరుగుతున్న అత్యాచారాల సంఘటనలు కూడా ఏపీ కూటమి ప్రభుత్వానికి తిప్పలు తీసుకువచ్చేలా ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలో కూటమిగా కట్టి గెలిచినప్పటికీ కూడా వైసిపి ప్రభుత్వానికి 40 శాతం ఓటింగ్ ఉన్నది.. ప్రస్తుతం జనసేన పార్టీ కూడా కాస్త హవా పెంచుతూ ఉండడంతో రాబోయే రోజుల్లో విడివిడిగా పోటీ చేస్తే ఖచ్చితంగా టిడిపి పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుంది. మరి సీఎం చంద్రబాబు ఏ విధంగా అడుగులు వేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: