ఆ రెండు ఒకటి కాదు జగన్.. జరా తెలుసుకొని మాట్లాడు: షర్మిల
అలా జగన్ కాంగ్రెస్ కి నైతిక మద్దతు ఇచ్చేలా స్టేట్మెంట్ ఇచ్చారు. అదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా ఆయన గొంతు వినిపించారు. హర్యానా ఫలితాల తరువాత, కాంగ్రెస్ కి ఇండియా కూటమి నేతల నుంచే స్ట్రాంగ్ సపోర్ట్ రాని నేపథ్యంలో జగన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఒక విధంగా బూస్ట్ ఇచ్చినట్లే అని విశ్లేషకులు అనుకుంటూ ఉండగా, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు... జగన్ కి స్వయాన చెల్లెలు అయిన షర్మిల మాత్రం జగన్ స్టేట్మెంట్ నే తప్పు పడుతూ విమర్శలు గుప్పించడం ఇపుడు పలు చర్చలకు దారితీస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హర్యానా ఏపీ రెండూ ఒక్కటి కావు అని ఆమె తనదైన శైలిలో ఝలక్ ఇచ్చారు.
ఆమె ఓ మీడియా ముఖంగా మాట్లాడుతూ... హర్యానాలో అన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పినప్పటికీ, ఫలితాలు వేరేగా వచ్చాయని, అందుకే కాంగ్రెస్ పోరాడుతోందని అన్నారు. ఏపీలో అయితే కేవలం వైసీపీ చేయించుకున్న సొంత సర్వేలు తప్ప మిగిలినవి అన్నీ కూడా కూటమి గెలుస్తుందనే విషయాన్ని బల్ల గుద్ది మరీ చెప్పాయన్న విషయం అన్న జగన్ రెడ్డికి షర్మిల గుర్తు చేసారు. జగన్ ఓటమిని జనాలే రాశారు తప్ప ఈవీఎంల భ్రమలు వద్దు! అంటూ హెచ్చరించారు. కాగా బీజేపీని ఒక వైపు తప్పు పడుతూ కాంగ్రెస్ కి నైతిక మద్దతు జగన్ ఇచ్చినా కూడా చెల్లెమ్మ మాత్రం జగన్ నే కార్నర్ చేయడం ఇపుడు వైసీపీ వాళ్లకు మింగుడుపడడంలేదు!